బెంగళూరుకు చెందిన ఏవన్ స్పోర్ట్స్ వరల్డ్ సీఈఓ కార్తీక్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పురుష అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వబోమని ప్రకటించారు. ఓ మాజీ ఉద్యోగి మహిళా సిబ్బందిని వేధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ హక్కులకు భంగకరమని నెటిజన్లు, నిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు.