పల్నాడు జిల్లాలో జరిగిన విషాద ఘటన రేబీస్ వ్యాధి తీవ్రతను మరోసారి గుర్తు చేసింది. పసిబాలుడు రుద్రాంక్ష్ కుక్కకాటుకు గురై సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోయాడు. రేబీస్ లక్షణాలు ఒక్కసారి కనిపించాయంటే ప్రాణం నిలపడం అసాధ్యం. జంతువుల కాటు, గీతలు, నాకడం పట్ల వెంటనే అప్రమత్తమై వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.