మంచిర్యాల జిల్లాలో ఆన్లైన్ గేమింగ్ వ్యసనంతో ఓ మేస్త్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బూదకుర్దు గ్రామానికి చెందిన చీకటి రాజేశం, ఆన్లైన్ ఆటలకు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. గతంలో రూ. 9 లక్షల అప్పును అతని సోదరుడు తీర్చినా, వ్యసనం వీడక పోవడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.