నటి ఫరియా అబ్దుల్లా బోనాల వేడుకల్లో పాల్గొన్నందుకు ఎదురైన మతపరమైన ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. నిజమైన భక్తి అంటే ప్రతి జీవిలో దేవుడిని చూడటమేనని, మతాన్ని సంకుచిత ఆలోచనలతో చూడకూడదని ఆమె స్పష్టం చేశారు. తనపై ఎంత ద్వేషం చిమ్మినా ప్రేమనే పంచుతానని ఫరియా పేర్కొన్నారు, ఆమె వీడియో వైరల్‌గా మారింది.