ప్యాన్ ఇండియా సినిమా విజయంతో సౌత్ స్టార్స్‌కు ముంబై ఇప్పుడు సొంత ఇంటిలా మారింది. ఒకప్పుడు బాలీవుడ్‌కు అత్తారిల్లైన ముంబై ఇప్పుడు మన హీరోల కంట్రోల్లో ఉంది. యష్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ధనుష్, సూర్య వంటి తారలు ముంబైలో కోట్లు వెచ్చించి ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. సమంత, రష్మిక వంటి హీరోయిన్లు సైతం అక్కడ స్థిరపడుతున్నారు. ఇది ప్యాన్ ఇండియా సినిమా శక్తికి నిదర్శనం.