స్పోర్ట్స్ బ్యాగు తెరిచిన యువకుడు.. లోపలున్నది చూసి పరుగో పరుగు!
విశాఖపట్నంలోని నేవల్ క్వార్టర్స్‌లో ఓ యువకుడి స్పోర్ట్స్ బ్యాగులో అత్యంత ప్రమాదకరమైన రక్తపింజరి పాము కనిపించడం కలకలం రేపింది. బ్యాగు నుంచి అలికిడి రావడంతో జిప్ తెరిచి చూడగా పాము కనిపించడంతో యువకుడు భయంతో కేకలు వేశాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు స్నేక్ క్యాచర్ నాగరాజు అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ప్రజలు బ్యాగులు, దుస్తులు వాడే ముందు జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు సూచించారు.
విశాఖపట్నంలోని నేవల్ క్వార్టర్స్‌లో ఉండే ఒక యువకుడు రోజూ మాదిరిగా స్పోర్ట్స్ ప్రాక్టీస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. షూస్ వేసుకుని, పక్కనే ఉన్న తన స్పోర్ట్స్ బ్యాగులో గ్లౌస్ సర్దుకునేందుకు దానిని చేతిలోకి తీసుకున్నాడు. అయితే బ్యాగు పట్టుకునేసరికి లోపల ఏదో కదులుతున్న అలికిడి వినిపించింది. వెంటనే జిప్ తెరిచి చూసి అవాక్కయ్యాడు. బ్యాగులోపల అత్యంత ప్రమాదకరమైన ‘రక్తపింజరి’ పాము తిష్ట వేసి ఉంది. దీంతో ఆ యువకుడు భయంతో గట్టిగా కేకలు పెట్టాడు. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానిక స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. తక్షణమే అక్కడకు చేరుకున్న నాగరాజు, ఎంతో చాకచక్యంగా ఆ విషసర్పం నుంచి కుటుంబ సభ్యులను రక్షించారు. పామును సురక్షితంగా డబ్బాలో బంధింది అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ పాము కాటు వేస్తే శరీరంలో రక్తం గడ్డకట్టి, అంతర్గత రక్తస్రావంతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. వర్షాకాలం, చలికాలంలో ఇలాంటి విషసర్పాలు ఆశ్రయం కోసం దుస్తులు, బ్యాగుల్లోకి చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్
ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్‌ఈసీసీ సంచలన నివేదిక!
10వ తరగతి అర్హతతో రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
స్పోర్ట్స్ బ్యాగు తెరిచిన యువకుడు.. లోపలున్నది చూసి పరుగో పరుగు!
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్
ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!

