AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

Phani CH
|

Updated on: Aug 15, 2026 | 10:38 PM

Share

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఓ తల్లి తన పిల్లలను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చూపిన ధైర్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్లాట్‌ఫామ్‌, రైలు పట్టాల మధ్య ఇరుకైన ప్రదేశంలో ఇద్దరు పిల్లలు చిక్కుకోగా.. వారిపై తల్లి కవచంలా వంగి నిలబడింది. రైలు అత్యంత సమీపం నుంచి దూసుకెళ్లినా ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు. తల్లి ధైర్యాన్ని కొందరు ప్రశంసించగా, పిల్లలను అక్కడికి తీసుకెళ్లడంపై మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కళ్లు బైర్లు కమ్మే భయానక దృశ్యం ఒకటి కెమెరాకు చిక్కింది. వేగంగా దూసుకొస్తున్న రైలు నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన శరీరాన్నే అడ్డుపెట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్లాట్‌ఫామ్‌కు, రైలు పట్టాలకు మధ్య ఉన్న అత్యంత ఇరుకైన సందులో ఇద్దరు పిల్లలు గోడకు అతుక్కుని ఉండగా, ఆ తల్లి వారిపై వంగి కవచంలా నిలబడింది. రైలు అతి సమీపం నుంచి వేగంగా వెళ్తుండటంతో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. రైలు పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత తల్లి, పిల్లలు సురక్షితంగా పైకి లేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను ఓ యూజర్‌ ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పిల్లలను కాపాడుకునేందుకు తల్లి చూపిన ధైర్యాన్ని, కన్నప్రేమను కొందరు కొనియాడుతుంటే.. అంత ప్రమాదకరమైన ప్రదేశానికి పిల్లలను తీసుకెళ్లడం బాధ్యతారాహిత్యమని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే వారు ఆ ప్రమాదకరమైన స్థలానికి ఎలా చేరుకున్నారనే దానిపై స్పష్టత లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్‌

ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్‌ఈసీసీ సంచలన నివేదిక!

10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక!

నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!

Google Drive: గూగుల్ డ్రైవ్ వాడేవారికి అలర్ట్‌.. ఫొటోల బ్యాకప్ విషయంలో కీలక మార్పులు

Follow Us