AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!

నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!

Phani CH
|

Updated on: Aug 15, 2026 | 4:46 PM

Share

తెలంగాణలోని జగిత్యాల మండలం మోరేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న శివాలయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారీ శివుని విగ్రహంపైకి ఎక్కిన ఓ నల్లని పాము.. విగ్రహం మొత్తం చుట్టూ తిరిగి చివరకు పరమేశ్వరుడి మెడలో హారంలా చుట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు భక్తిభావంతో పూజలు చేశారు. ఎవరికీ హాని చేయకుండా పాము వెళ్లిపోవడంతో ఈ ఘటన శివలీలేనంటూ చర్చించుకున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగుపాము పరమశివుని మెడలో ఆభరణంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలా శివుని మెడలో హారంగా నాగుపామును చిత్రపటాల్లోనో, సినిమాల్లోనో చూశాం… ఇప్పుడు నిజంగానే ఓ భారీ శివుని విగ్రహం మెడలో కంఠాభరణంగా ఓ నల్లని పాము దర్శనమిచ్చింది. అది చూసి స్థానికులు ఇది శివుని మహిమే అని పూజలు చేశారు. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మండలం మోరేపల్లి గ్రామంలో నూతనంగా శివాలయం నిర్మిస్తున్నారు. ఇక్కడ భారీ సైజులో శివుని విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఆ విగ్రహం నిర్మాణంలో ఉంది. ఈ క్రమంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ , భారీ సైజులో ఉన్న పాము శివుడి విగ్రహం పై కనిపించింది. అది.. తన స్వామి విగ్రహం సరిగ్గా నిర్మిస్తున్నారో లేదో.. విగ్రహం ఏర్పాటులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో… అని చెక్‌ చేస్తున్నట్టుగా విగ్రహం మొత్తం కలియదిరుగుతూ సందడి చేసింది. విగ్రహం ప్రతి అంగుళం తడుముతున్నట్టుగా సంచరిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం..హమ్మయ్య అంతా బాగానే ఉంది అన్నట్టుగా.. పరమేశ్వరుని మెడలో హారంలా చుట్టుకొని కాసేపు అలాగే ఉండిపోయింది. ఈ వింతను చూసేందుకు అక్కడికి జనం పెద్దసంఖ్యలో గుమిగూడారు. జనాల అలికిడితో ఆ పాము.. ఇంక నాపని అయిపోయింది అన్నట్టుగా అక్కడినుంచి వెళ్లిపోయింది. ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టకుండా పాము వెళ్లిపోవడంతో స్థానికులు ఇదంతా శివలీలే అని చర్చించుకున్నారు. ఆలయం నిర్మాణంలో ఉన్నక్రమంలో ఇలా నాగేంద్రుడు ఆలయానికి రావడం శుభపరిణామమని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ పాము దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Google Drive: గూగుల్ డ్రైవ్ వాడేవారికి అలర్ట్‌.. ఫొటోల బ్యాకప్ విషయంలో కీలక మార్పులు

Monsoon Update: పసిఫిక్‌లో ఎల్‌నినో సెగ.. భారత్‌లో నిలకడగా రుతుపవనాలు.. కరువు భయం లేనట్లే!

Follow Us