AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song: పాట అంటే ఇట్లుండాలె.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఫోక్ సాంగ్స్... ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భాషతో సంబంధమే లేకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై లక్షల కొద్ది వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. రోజుకో కొత్త పాట నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మేము మీ ముందుకు ఒక సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్ తీసుకోచ్చాం. ఇంతకీ ఆ పాటను మీరు విన్నారా..

Folk Song: పాట అంటే ఇట్లుండాలె.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
Genne Rama Genne Rama
Rajitha Chanti
|

Updated on: Jun 17, 2026 | 5:11 PM

Share

సంగీతానికి భాషతో సంబంధం లేదు, అది హృదయాలను కదిలిస్తుంది. ఈ మాట చాలా సార్లు వినే ఉంటారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ , యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. పక్కా మాస్ వైబ్రేషన్స్, పల్లె పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన మెలోడీ సాంగ్ యూట్యూబ్ లో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ పాటను విన్న ప్రతి ఒక్కరూ దీని లూప్ మోడ్‌లో వింటూ, తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తున్నారు. కేవలం పాట మాత్రమే కాకుండా, దీని విజువల్స్, కొరియోగ్రఫీ, నటీనటుల హావభావాలు ఈ సాంగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఫోక్ సింగర్ కనకన్న పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసుకుందామా.

ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

మనం మాట్లాడుకుంటున్న పాట పేరు “గెన్నె రామ గెన్నె రామ.. గెన్నె రామ గెట్టు మీద.. గున్న మామిడో పిలడ.. గున్న మామిడో పిలడ” అంటూ కనకవ్వ పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఈ పాటను కనకవ్వ పాడగా.. ఎస్కే బాజీ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటలో తమదైన మాస్ స్టెప్పులతో అలరించారు టోనీ కిక్. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాతో పాటు అటు యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

“గిన్నె రామ గిన్నె రామ” అనేది కేవలం ఒక సరదా పాట మాత్రమే కాదు; ఇది తెలంగాణ పల్లె జీవితాన్ని, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ సాంగ్ అని చెప్పాలి. పూర్వం పల్లెల్లో పొలం పనులు చేసేటప్పుడు, అలసట తెలియకుండా ఉండటానికి మహిళలు సమూహాలుగా చేరి ఇలాంటి పాటలు పాడుకునేవారు. కనకవ్వ సేకరించిన ఈ పాత జానపద పాట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం డీజేలోనూ మరోమోగుతుంది.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

కనకవ్వ ఫోక్ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..

Follow Us