పెళ్లి ఎప్పుడో చెప్పేసిన శ్రీముఖి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన యాంకరమ్మ..
Rajitha Chanti
Pic credit - Instagram
17 June 2026
తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన ఎనర్జీ, చమత్కారాలతో స్టార్ యాంకర్‌గా దూసుకుపోతోంది శ్రీముఖి. ఈ బ్యూటీకి ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా సందడి చేసే ఈ భామ.. తాజాగా సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.
తాజాగా ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసింది. ట్రెడిషనల్ పట్టుచీరలో మెరిసిపోయిన శ్రీముఖిని, యాంకర్ సుమ తన ప్రశ్నలతో స్టేజ్ మీద అలరించింది.
ముఖ్యంగా ప్రస్తుతం 33 ఏళ్లకు చేరుకున్న శ్రీముఖికి ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే ఒకే ఒక్క ప్రశ్న.. "నీ పెళ్లెప్పుడు?" ఇప్పుడు ఇదే విషయం అడిగింది యాంకర్ సుమ.
ఈ సినిమా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయంలోనే సమంత పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చింది శ్రీముఖి.
ఇప్పుడు ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. జూన్ 19న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాలని కోరుకుంటున్నాను.
ఆ సక్సెస్ తర్వాత నా పెళ్లి కూడా జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని శ్రీముఖి పేర్కొంది. "పెళ్లి చేసుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను.
చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మండపం, క్యాటరింగ్ అన్నీ రెడీగా ఉన్నాయి కానీ కరెక్ట్ వరుడే ఇంకా దొరకలేదు. పెళ్లికొడుకు కోసమే వెయిటింగ్ అన్నారు శ్రీముఖి.