AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన లెజండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయన కేవలం నటుడే కాదు, దర్శకుడు, నిర్మాత , రాజకీయ నాయకుడిగా కూడా రాణించారు. 1964లో 'తేనెమనసులు' సినిమాతో కథానాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 350కి పైగా సినిమాల్లో నటించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలుగులో ఇప్పుడున్న హీరోలలో తనకు నచ్చిన హీరో ఎవరనే విషయాన్ని వెల్లడించారు.

ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..
Krishna About His Favourite Hero In Tollywood
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2026 | 3:35 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, ఎన్నో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. గతంలో ఓ ఇంటర్వ్యూలో కృష్ణ, ఆయన సతీమణి, దర్శకురాలు విజయనిర్మల పంచుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో వారిద్దరూ పంచుకున్న విషయాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రస్తుత తరం స్టార్ హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లలో మీకు నచ్చిన నటుడు ఎవరు అని ప్రశ్నించగా.. సూపర్ స్టార్ కృష్ణ ఏమాత్రం తడుముకోకుండా “జూనియర్ ఎన్టీఆర్” అని సమాధానమిచ్చారు. తారక్ నటన, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ పట్ల కృష్ణకు ఉన్న గౌరవాన్ని ఈ సమాధానం తెలియజేస్తుంది. అదేవిధంగా తన కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన పాత చిత్రాలలో దేనిని రీమేక్ చేయాలనుంది అనే ప్రశ్నకు.. కృష్ణ తన క్లాసిక్ స్పై థ్రిల్లర్ “గూఢచారి 116” ని అన్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆధునిక హంగులతో ఆ సినిమాను మహేష్‌తో తీస్తే బాగుంటుందని ఆయన చెప్పుకోచ్చారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..

ఒకవేళ మహేష్ బాబును తానే స్వయంగా డైరెక్ట్ చేయాల్సి వస్తే, ఒక పవర్‌ఫుల్ జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ అడ్వెంచర్ కథను ఎంచుకుంటానని కృష్ణ పేర్కొన్నారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, టాలీవుడ్ లెజెండ్ ఎన్టీఆర్ (సీనియర్ ఎన్టీఆర్)తో తనకున్న అనుబంధాన్ని కృష్ణ గుర్తుచేసుకున్నారు. కృష్ణ నటించిన మైలురాయి లాంటి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారని, కృష్ణను కౌగిలించుకుని మరీ అభినందించారని చెప్పారు. ఈ పాత్రకు కృష్ణ మాత్రమే పూర్తి న్యాయం చేయగలరని ఎన్టీఆర్ స్వయంగా కొనియాడడం గమనార్హం.

ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

అలాగే విజయనిర్మల మాట్లాడుతూ జయసుధ, విజయశాంతి వంటి మహానటీల ప్రతిభను తానే ముందుగా గుర్తించి ఇండస్ట్రీకి పరిచయం చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ పాత తరం జ్ఞాపకాలను, ఇప్పటి తరం స్టార్లపై ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..

సూపర్ స్టార్ కృష్ణకు ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్..

Krishna, Jr.ntr

Krishna, Jr.ntr

ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

Follow Us