AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

అక్కినేని నాగచైతన్య టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరోలలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో వచ్చిన 'జోష్' సినిమాతో నాగచైతన్య హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు గానూ ఆయన ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ (సౌత్) అవార్డును అందుకున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేసావే' (2010) సినిమా చైతన్య కెరీర్‌లో ఒక పెద్ద బ్రేక్‌థ్రూగా నిలిచింది.

Rajitha Chanti
|

Updated on: Jun 14, 2026 | 10:04 PM

Share
అక్కినేని నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తూ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'దూత' (Dhootha) ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సస్పెన్స్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ మొదటి సీజన్ భారీ విజయం సాధించడంతో, ఇప్పుడు 'దూత సీజన్ 2' కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

1 / 5
ఈ క్రమంలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అదిరిపోయే క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. 'దూత సీజన్ 2'లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ భూమిక చావ్లా (Bhumika Chawla) ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. కథను మలుపు తిప్పే, ఎంతో ప్రాధాన్యత ఉన్న ఒక పవర్‌ఫుల్ ,ఇంటెన్స్ క్యారెక్టర్ కోసం దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఆమెను ఎంపిక చేశారు. భూమిక ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.

2 / 5
ఈ వెబ్ సిరీస్ ద్వారా ఒక అరుదైన, ఆసక్తికరమైన కాంబినేషన్ మరోసారి పునరావృతం కాబోతుండటం విశేషం. గతంలో 2018లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'సవ్యసాచి' సినిమాలో నాగచైతన్య, భూమిక కలిసి నటించారు. ఆ చిత్రంలో నాగచైతన్యకు అక్క పాత్రలో భూమిక కనిపించి మెప్పించారు. ఆ సినిమా వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, ఇప్పుడు మళ్లీ ఇంత కాలం తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకోబోతున్నారు.

3 / 5
ఈ క్రేజీ కాంబో 'దూత 2' ద్వారా పునరావృతం అవుతుండటంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఇక 'దూత 2' ప్రాజెక్ట్ నాగచైతన్య కెరీర్‌లో మరింత ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ఈ సిరీస్ ద్వారా ఆయన కేవలం హీరోగానే కాకుండా, నిర్మాతగా కూడా సరికొత్త అవతారంలోకి మారుతున్నారు. చైతన్య నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఇటీవల ఈ సిరీస్ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కాగా, కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు.

4 / 5
మొదటి సీజన్‌లో నటించిన పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ఈ సీక్వెల్‌లోనూ తమ పాత్రలను రిపీట్ చేయనున్నారు. ఫస్ట్ సీజన్‌ను మించిన మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో, హై వోల్టేజ్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డిజిటల్ ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

5 / 5
Follow Us
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌..అదేంటో తెలుసా?

ఫ్రిజ్‌లో పెట్టకుండానే 25 రోజుల వరకు నిల్వ ఉండే గుడ్డు పచ్చడి..!

రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

బీరకాయ తొక్కల పచ్చడి ఇలా చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు!

గ్రీస్‏లోనే అనిరుధ్, కావ్య పెళ్లి ఎందుకు.. ?

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్..ప్రారంభించనున్న అమిత్ షా

నిద్ర లేచే సరికి షాకింగ్ సీన్.. అమ్మాయిల జడలు కత్తిరిస్తుందెవరు..

ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న

హార్దిక్, అర్ష్‌దీప్ ట్రేడ్ కన్ఫామ్.. బీసీసీఐ కీలక ప్రకటన..!

ఇక ఈ రైలుకు తత్కాల్ టికెట్లు ఉండవు.. కొత్త రూల్స్ ఇవే!