AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పాత జ్ఞాపకం బయటకు వచ్చినా సినిమా అభిమానులకు అదొక పెద్ద పండగలా మారుతుంది. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాల అరుదైన ఫోటోలు నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణ రావుకు సంబంధించిన ఓ అరుదైన ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..
Dasari Narayana Rao, Chiran
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2026 | 6:53 PM

Share

పైన ఫోటోలో దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్. అతడు మరెవరో కాదు.. జబర్దస్త్ గడ్డం నవీన్. బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా అత్యంత ఆదరణ పొందిన నటుల్లో గడ్డం నవీన్ ఒకరు. తన విలక్షణమైన గడ్డం, అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులను నవ్వించిన నవీన్, చిత్ర పరిశ్రమలో విజయవంతంగా 25 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన నవీన్, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కుటుంబంలో ఆర్థిక కష్టాలు ఉండేవి. దీంతో చదువుకుంటూనే మెకానిక్ షాపులో, బట్టల షాపులో, చివరకు ఆఫీస్ బాయ్‌గా కూడా పనులు చేశారు. అయితే లోకల్ (హైదరాబాద్) కావడం వల్ల ఇండస్ట్రీలో ఆకలి బాధలు పడలేదని, కానీ మిగిలిన అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. 1995లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్, తొలినాళ్లలో ‘ఇష్టం’, ‘ఆది’, ‘ఇడియట్’ వంటి ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రలు, విలన్ గ్యాంగ్ పాత్రలు చేశారు. అయితే, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అదిరే అభి, చలాకీ చంటిల సహకారంతో జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఆయన జీవితం మలుపు తిరిగింది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

పరిస్థితులు బాలేనప్పుడు అనుకోకుండా పెంచిన గడ్డం తనకు ‘డబుల్ ప్లస్’ అయిందని, అదే తనకు విలక్షణమైన గుర్తింపును తెచ్చిపెట్టిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నిజానికి తాను ఇండస్ట్రీకి ‘హీరో’ అవుదామనే వచ్చానని, కృష్ణ, చిరంజీవిల సినిమాలు చూసి నటుడిగా మారాలని స్ఫూర్తి పొందానని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ప్రస్తుతం గడ్డం నవీన్ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తెలుగులో ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. జబర్దస్త్ ఇచ్చిన లైఫ్ వల్ల తనను అందరూ ‘జబర్దస్త్ గడ్డం నవీన్’ అని పిలిస్తే ఎంతో గర్వంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

జబర్దస్త్ నవీన్…

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

Follow Us