యుక్తి నీ అందాలు చూస్తే కలుగుతుంది ముక్తి

17 June 2026

Pic credit - Instagram

Phani Ch

టాలీవుడ్ లోకి మరో కొత్త బ్యూటీ వచ్చింది.  అందం, అభినయంతో కట్టిపడేసేందుకు సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.. ఆమె ఎవరో కాదు యుక్తి తరేజా.

 నాగశౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ యుక్తి తరేజా.

యుక్తి తరేజా హర్యానాకు లోని కర్నాల్  లో జన్మించింది. ఈమె ఢిల్లీ లో ఓ విశ్వవిద్యాలయంలో డిగ్రీ (కామర్స్‌) చదివింది ఈ చిన్నది.

ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల ఆమె జీవితం మలుపు తిరిగింది. అక్కడ డాన్స్‌ పోటీలు, ప్రదర్శనల్లో పాల్గొంటూ మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది.

2021 లో వచ్చిన ఇమ్రాన్‌ హష్మీతో కలిసి చేసిన ‘లుట్ గయే’ పాటతో బాగా పాపులర్ అయింది యుక్తి తరేజా. ఈ పాట వల్లే ‘రంగబలి’లో నటించే అవకాశం అందుకుంది.

ఆ తర్వాత ‘మార్కో’ అనే మలయాళ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం యుక్తి పలు చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది.

యుక్తి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.