AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గ్లామర్ లుక్స్, నటనతో కట్టిపడేసింది. అటు హిందీలోనూ సత్తా చాటింది. ప్రస్తుతం ఆమె వయసు 51 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. తాజాగా తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఓ వీడియో షేర్ చేసింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందామా.

Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు... కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..
Ameesha Patel
Rajitha Chanti
|

Updated on: Jun 17, 2026 | 11:41 AM

Share

భారతీయ సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె. అందం, గ్లామర్, నటనతో కట్టిపడేసింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో వరుసగా హిట్స్ అందుకుంది. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె వయసు 51 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటుంది. తాజాగా తన స్నేహితుడితో కలిసి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అమీషా పటేల్. పాకిస్తానీ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ తో తన స్నేహం సరిహద్దులను దాటింది. సోషల్ మీడియాలో వారి స్నేహపూర్వకతతో ఈ జంట తరచుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా, అభిమానులు వారి సహజమైన కెమిస్ట్రీని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు, వారిద్దరి పాత వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..

ఆ క్లిప్‌లో, అమీషా 2002లో వచ్చిన ‘క్రాంతి’ సినిమాలోని “దిల్ మే దర్ద్ సా జగా హై” పాటకు ఇమ్రాన్, అమీషాలు పాడుతూ కనిపించారు. జూన్ 9న అమీషా పుట్టినరోజు సందర్భంగా, “నా బెస్టీకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అనే క్యాప్షన్‌తో ఇమ్రాన్ అబ్బాస్ ఈ వీడియోను మొదటగా షేర్ చేశారు. వీరిద్దరి సరిహద్దుల స్నేహాన్ని చూసి అభిమానులు మరోసారి ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరి జోడి అందంగా ఉందని.. ఇద్దరూ కలిసి ఏదైనా సినిమా చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అమీషా , ఇమ్రాన్ గతంలో వారి ఆత్మీయ సంబంధం కారణంగా వార్తల్లో నిలిచారు. వీరు ప్రేమలో ఉన్నారంటూ గతంలో అనేక రూమర్స్ వినిపించాయి. అయితే, తామిద్దరూ కేవలం స్నేహితులమని, ఆ వీడియో సరదాగా, అప్పటికప్పుడు తీసినదని అమీషా గతంలో స్పష్టం చేసింది.

ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..

అమీషా పటేల్ వీడియో..

ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

బాలీవుడ్ చిత్రం ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అమీషా పటేల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ అడుగుపెట్టి ఇక్కడి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక్కడ ఆమె చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ, అవి బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అమీషా పటేల్ తెలుగు ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’ (2000) చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు సరసన నాని చిత్రంలో నటించారు.

అబ్బాస్ వీడియో..

ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

Follow Us