స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్ ఫాస్ట్ స్కీం నేటి నుంచే!
వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈసారి విద్యార్థులకు సరికొత్త బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వారంలో ఆరు రోజుల పాటు పోషకాహారంతో కూడిన వివిధ రకాల అల్పాహారాన్ని అందించనున్నారు. కొత్త పుస్తకాలు, యూనిఫాంలతో విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టగా, ఈ పథకానికి ప్రభుత్వం రూ.720 కోట్లు కేటాయించింది.
సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత తెలంగాణలో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈసారి విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాదు.. అంతకంటే ముందే వారి కడుపు నింపే ఒక అద్భుతమైన కానుకను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్తగా ‘బ్రేక్ ఫాస్ట్ స్కీం’ ఇవాళ్టినుంచే అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజే విద్యార్థులకు కొత్త పుస్తకాలు, సరికొత్త యూనిఫాంలను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వం విద్యార్ధులకు అందించే బ్రేక్ ఫాస్ట్ మెనూ కూడా అద్దిరిపోయింది.పిల్లలు ఇష్టంగా తినడమే కాకుండా, వారిలో పోషకాహార లోపాన్ని నివారించేలా ప్రభుత్వం వారంలో ఆరు రోజులకు ఆరు రకాల సూపర్ టిఫిన్ మెనూని ఖరారు చేసింది. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా రోజుకో రకం రుచికరమైన అల్పాహారం అందించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం వేడివేడి దోసె-చట్నీ లేదా మెత్తని చపాతీ-కర్రీ, పాలు అందిస్తారు. మంగళవారంఆరోగ్యాన్నిచ్చే మిల్లెట్ ఇడ్లీ-సాంబారు,రాగి జావ, బుధవారం అందరికీ ఇష్టమైన పూరి-ఆలూ కుర్మా,పాలు, గురువారం బలవర్ధకమైన మిల్లెట్ ఇడ్లీ- సాంబారు, రాగి జావ, శుక్రవారం రుచికరమైన మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్-చట్నీ, పాలు , శనివారం క్రంచీగా ఉండే బోండా-చట్నీ, రాగి జావ అందిస్తారు. రోజువారీ రుచికరమైన టిఫిన్‌తో పాటు వారంలో మూడు రోజులు వేడి పాలు, మిగిలిన మూడు రోజులు శరీరానికి చలవ మరియు బలాన్నిచ్చే రాగి జావను విద్యార్థులకు ప్రత్యేకంగా అందిస్తున్నారు. బడులు తెరిచిన మొదటి రోజే విద్యార్థుల చేతికి కొత్త పాఠ్యపుస్తకాలు, సరికొత్త డిజైన్లతో కూడిన రెండు జతల యూనిఫాంలు అందేలా ప్రభుత్వం పక్కా ప్లానింగ్ చేసింది. ఉదయాన్నే నోరూరించే అల్పాహారం, చేతిలో కొత్త పుస్తకాలు, ఒంటిపై సరికొత్త రంగుల డ్రెస్సులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా బడిబాట పట్టారు. ఈ సరికొత్త పథకంపై అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే ఈ అల్పాహార పథకం కోసం దాదాపు 540 కోట్లు, పాల కోసం 150 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా. ఈ విద్యా సంవత్సరానికి దాదాపు 720 కోట్లు కేటాయించినట్టు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కార్పొరేట్ లుక్‌లో సర్కారు బడులు.. విద్యార్థులకు సరికొత్త యూనిఫాంలు..
Brazil : ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
అల్లు అర్జున్ ఎఫెక్ట్.. AA23 థీమ్ మ్యూజిక్‌ను ఉపయోగించిన.. ప్రధాని నరేంద్ర మోడి
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు

