AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరు మారిన మారని బుద్ధి.. మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి!

కర్నూలు జిల్లాలో ఓ గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి లక్ష్మీనాత్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

ఊరు మారిన మారని బుద్ధి.. మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి!
Village Secretary Caught Acb
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 3:38 PM

Share

కర్నూలు జిల్లాలో ఓ గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి లక్ష్మీనాత్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తికి చెందిన సంధ్యపోగు సతీష్ ప్రభుత్వ స్థలానికి డీ పట్టా పొంది గుడిసె నిర్మించుకున్నాడు. అదే స్థలంలో శాశ్వత ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి కోసం గ్రామ కార్యదర్శి లక్ష్మీనాత్‌ను సంప్రదించాడు. అయితే నిబంధనల పేరుతో కాలయాపన చేసిన లక్ష్మీనాత్, అధికారిక ఫీజుతో పాటు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు మంగళవారం (జూన్ 16) సతీష్ నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటుండగా హనుమాన్ జంక్షన్ సమీపంలోని ఓ హోటల్ వద్ద లక్ష్మీనాత్‌ను అధికారులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఆయన కర్నూలుకు కారులో వెళ్తున్నట్లు తెలిసింది.

ఇప్పటికే పంచాయతీ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో లక్ష్మీనాత్‌ను దొరపల్లెకు బదిలీ చేసినట్లు సమాచారం. అయితే స్థానిక రాజకీయ నాయకుల సహకారంతో తిరిగి వెల్దుర్తికి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, చివరకు ఏసీబీ వలలో చిక్కి కటకటాల పాలయ్యాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు, విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us