ఉత్తమ పాపులర్ చిత్రం గా ‘కల్కి 2898 AD
72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్రాలు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. టాలీవుడ్ మొత్తం 8 అవార్డులు గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. కల్కి 2898 ఏడీ ఉత్తమ పాపులర్ చిత్రంగా, కమిటీ కుర్రాళ్ళు ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా నిలిచాయి. పలు విభాగాల్లో తెలుగు ప్రతిభకు జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది.
72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్రాల హవా స్పష్టంగా కనిపించింది. దేశవ్యాప్తంగా దాదాపు 400 సినిమాలు స్క్రీనింగ్‌కు రాగా, టాలీవుడ్ ఏకంగా 8 అవార్డులను కైవసం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు జ్యూరీ మెంబర్‌గా వి.ఎన్. ఆదిత్య వ్యవహరించిన ఈ పోటీలలో, మొత్తం 43 కేటగిరీలకు గానూ తెలుగు సినిమాలు తమ సత్తా చాటాయి. ప్రముఖ చిత్రం కల్కి 2898 ఏడీ ఉత్తమ పాపులర్ చిత్రంగా అవార్డును అందుకుంది. ఈ సినిమాకు ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. కమిటీ కుర్రాళ్ళు ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు లక్కీ భాస్కర్ సినిమాకు గాను వెంకీ అట్లూరికి దక్కగా, పుష్ప 2: ది రూల్ సినిమాకు గాను సుకుమార్ బండ్రెడ్డి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును గెలుచుకున్నారు. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా, కల్కి 2898 ఏడీ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలోనూ అవార్డులు సాధించాయి. పుష్ప చిత్రానికి దీపాలి నూర్, శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా, కమిటీ కుర్రాళ్ళు చిత్రానికి పి. రవికుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా పురస్కారాలు అందుకున్నారు.
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

