ఉత్తర్ ప్రదేశ్లోని బెహ్రైచ్ జిల్లా, ఘాఘ్రా నది వద్ద విషాదం చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలుడిని మొసలి నోట కర్చుకొని నదిలోకి లాక్కెళ్ళి ప్రాణాలు తీసింది. మేనమామ ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు. గంటల గాలింపు తర్వాత బాలుడి మృతదేహం లభ్యమైంది. నదుల దగ్గర పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.