నన్ను టార్చర్ చేశారు.. మానసికంగా కుంగిపోయాను.. వంద కోట్లు ఇచ్చినా మళ్లీ ఆ పని చేయను.. హీరోయిన్..
సోషల్ మీడియాలో సెలబ్రెటీల వ్యక్తిగత భద్రత గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ప్రపంచంలో సినీతారల పర్సనల్ విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పటికే పలువురు తారలు డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ హీరోయిన్ సైతం సోషల్ మీడియా కారణంగా ఎంతో బాధపడ్డానని తెలిపారు.

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా విష్ణు విశాల్ సరసన ఆమె నటించిన మట్టి కుస్తీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కుస్తీ 2′ చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కార్యక్రమంలో మాట్లాడిన ఐశ్వర్య లక్ష్మి, తనకు వంద కోట్ల రూపాయలు ఇచ్చినా ఒక్క పని కూడా చేయనని అన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆమె మట్టి కుస్తీ 2 సినిమాతో మరో హిట్టు అందుకుంది. ఈ చిత్రానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కార్యక్రమంలో మాట్లాడిన ఐశ్వర్య లక్ష్మి, తనకు వంద కోట్ల రూపాయలు ఇచ్చినా ఒక్క పని కూడా చేయనని అన్నారు.
ఐశ్వర్య లక్ష్మి గతంలో ఇన్స్టాగ్రామ్తో సహా సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారు. కానీ ఒక సమయంలో, తాను సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఇప్పుడు అందుకు గల కారణం గురించి మాట్లాడిన ఐశ్వర్య లక్ష్మి, తనకు వంద కోట్ల రూపాయలు ఇచ్చినా సోషల్ మీడియాకు తిరిగి రానని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ, “సోషల్ మీడియాను వదిలేయడం నాకు చాలా మనశ్శాంతిని ఇచ్చింది. నేను ఇంతకుముందు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నప్పుడు, కొంతమంది నా ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు పోస్ట్ చేశారు, దానివల్ల నేను చాలా మానసిక వేదనకు గురయ్యాను” అని అన్నారు.
“ఆ సమయంలో ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉందని, అందరూ నన్ను ద్వేషిస్తున్నారని నాకు అనిపించింది. అందుకే ఎవరైనా నాకు వంద కోట్ల రూపాయలు ఇచ్చినా నేను సోషల్ మీడియా వైపు చూడను. ఆన్లైన్లో పోస్ట్ చేయడం, కామెంట్ చేయడం కంటే ప్రజలను వ్యక్తిగతంగా కలవడానికే నేను ఇష్టపడతాను,” అని అన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..
ఐశ్వర్య లక్ష్మీ

Aishwarya Lekshmi.photo
ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..
