AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : చంచల్ గూడ సెంట్రల్ జైల్లో నన్ను బట్టలు విప్పి నిల్చోపెట్టారు.. ఎంత నరకంగా ఉన్నా.. సీరియల్ నటుడు కామెంట్స్..

నటుడు కృష్ణ చంచల్‌గూడ జైలులో గడిపిన రెండు వారాల అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పదిమంది మంచి కోసం సాగించిన ఒక పోరాటం కారణంగా ఆయన జైలు జీవితాన్ని చవిచూశానని అన్నారు. జనరల్ బ్యారక్‌లోని 80 మంది ఖైదీలు, డోర్లు లేని బాత్రూమ్‌లు వంటి షాకింగ్ పరిస్థితులు, అలాగే జైలర్ నుండి అందిన ప్రోత్సాహకర మాటలు ఆయనకు మరచిపోలేని అనుభూతినిచ్చాయి.

Tollywood : చంచల్ గూడ సెంట్రల్ జైల్లో నన్ను బట్టలు విప్పి నిల్చోపెట్టారు.. ఎంత నరకంగా ఉన్నా.. సీరియల్ నటుడు కామెంట్స్..
Kaushik
Rajitha Chanti
|

Updated on: Jul 21, 2026 | 7:58 AM

Share

పదిమంది మంచి కోసం సాగించిన ఒక పోరాటం కారణంగా నటుడు కృష్ణ కౌశిక్ చంచల్‌గూడ సెంట్రల్ జైలులో రెండు వారాల పాటు గడిపిన అనూహ్య అనుభవాలను వెల్లడించారు. ఈ కాలం తన జీవితంలో ఊహించని మలుపు అని, ఎన్నో కొత్త పాఠాలను నేర్పిందని ఆయన వివరించారు. కృష్ణ కౌశిక్ బేసిక్‌గా అగ్రెసివ్ స్వభావం కలవారని, అన్యాయంపై పోరాడటం తన నైజమని తెలిపారు. తన సోదరుడు ఆదిత్య కూడా ఈ పోరాటంలో తనతో ఉన్నా, తనంత చురుగ్గా పాల్గొనలేదని చెప్పారు. జైలుకు వెళ్ళడం తన కెరీర్‌ను వ్యక్తిగతంగా ప్రభావితం చేస్తుందని తాను అస్సలు ఊహించలేదన్నారు. చంచల్‌గూడ జైలులోని జనరల్ బ్యారక్‌లో దాదాపు 80 మంది ఖైదీలతో కలిసి ఉన్నానని, అది ఒక హాస్యభరితమైన ఎపిసోడ్‌లా అనిపించిందని కౌశిక్ గుర్తుచేసుకున్నారు. ఖైదీలకు స్టీల్ బకెట్, గ్లాస్ ఇచ్చేవారని, వాటికి గొలుసు ఉండేదని తెలిపారు. ఉదయాన్నే కాఫీని ఆ బకెట్‌లోనే పోసేవారట. ప్లేట్, గ్లాస్ లాంటి వ్యక్తిగత వస్తువులను పక్కన పెడితే వెంటనే వాటిని ఇతరులు దొంగిలించేవారని, కానిస్టేబుల్‌ను అడిగితే జాగ్రత్తగా ఉండాలి, దొంగలు ఉంటారు అని చెప్పేవారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అక్కడ అత్యంత షాకింగ్ విషయాలలో ఒకటి డోర్లు లేని బాత్రూమ్‌లు. కేవలం ఒక చిన్న కర్టెన్ మాత్రమే అడ్డుగా ఉండేదని, ఇది గోప్యతకు తీవ్ర ఆటంకం కలిగించిందని ఆయన వివరించారు. భోజనం కూడా ప్లాస్టిక్ బకెట్లలో సాంబార్ లాంటివి వడ్డించేవారని, ఆ రోజు ఆకలి వేసినా భోజనం చేయలేకపోయానని కృష్ణ కౌశిక్ తెలిపారు. ప్రతి బ్యారక్‌కు ఒక ఖైదీ ఇన్‌చార్జ్‌గా ఉండేవాడని, తమ బ్యారక్‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న 20 ఏళ్ల యువకుడి గురించి కౌశిక్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆ యువకుడు కన్నడ సినిమాలకు టచ్-అప్ ఆర్టిస్ట్ అని, ఒక హీరోయిన్‌ను ప్రేమించి, ఆమె తిరస్కరించినందుకు హెయిర్ డ్రెస్సింగ్ కోంబ్‌తో ఆమెపై, ఆమె తండ్రిపై దాడి చేసి హత్యాయత్నం కేసులో ఇక్కడకు వచ్చాడని తెలిపారు. అతను కౌశిక్‌ని చూసి “అన్నా, నీ యాక్షన్ సూపర్. నీ నెక్స్ట్ సినిమాలు ఏంటి?” అని అడగటం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు.

జైలర్ కౌంటింగ్‌కు వచ్చినప్పుడు, కౌశిక్‌తో “మీరు పోరాడుతున్న కాజ్ మంచి కాజ్ సార్. అది ఎప్పటికైనా మీకు పే అవుతుంది” అని చెప్పినప్పుడు తనకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని తెలిపారు. ఈ మాటలు తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని, తాను అనుభవించిన ఈ కష్టం తన కోసం కాకుండా పదిమంది మంచి కోసమేనని గ్రహించానని చెప్పారు. అయితే, తాను కష్టంలో ఉన్నప్పుడు బయట నుండి, ముఖ్యంగా ఖాళీగా ఉన్నవారు కూడా మద్దతు ఇవ్వకపోవడం తనకు నిరాశ కలిగించిందని కృష్ణ కౌశిక్ వ్యక్తం చేశారు. మొత్తం 11 మందితో కలిసి ఈ పోరాటంలో పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..

నటుడు కౌశిక్..

Kaushik New

Kaushik New

ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..

Follow Us