Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..
నటుడు సుధాకర్ టాలీవుడ్‌లో ఒక విలక్షణమైన నటుడు, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 80, 90ల కాలంలో తన వినూత్నమైన డైలాగ్ డెలివరీ, విచిత్రమైన మేనరిజమ్స్ , బాడీ లాంగ్వేజ్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. చాలా మందికి సుధాకర్ కేవలం కమెడియన్‌గానే తెలుసు, కానీ ఆయన తన కెరీర్‌ను తమిళ చిత్రసీమలో హీరోగా ప్రారంభించారు.

ప్రముఖ హాస్యనటుడు సుధాకర్ ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించారు. చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత అనుభవాలు, అనారోగ్యం, అలాగే భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పుకొచ్చారు సుదీర్ఘకాలం తెరపై కనిపించకపోవడంపై మాట్లాడుతూ, తన స్థానాన్ని భర్తీ చేసే కమెడియన్లు ఇప్పుడు లేరని అన్నారు. సప్తగిరి కామెడీ కొంతవరకు ఆకట్టుకుందని, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ వంటి దిగ్గజాల శైలి తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎం.ఎస్. నారాయణ హాస్యం, ఆయన నటన అంటే తనకి చాలా ఇష్టమని సుధాకర్ వెల్లడించారు. సుధాకర్ తన అనారోగ్యం గురించి ప్రస్తావిస్తూ, కోమాలో ఉన్నప్పుడు ప్రభువు ఏసుక్రీస్తు దయ, అలాగే ఎందరో చేసిన ప్రార్థనల ఫలితంగా తాను తిరిగి సాధారణ స్థితికి వచ్చానని వివరించారు. తన మెడలో ధరించే క్రాస్ తన అత్తగారు బహుమతిగా ఇచ్చారని, అది తన కెరీర్‌లో కలిసొచ్చిందని, ప్రతి సినిమాలోనూ అది తనతో పాటే ఉంటుందని తెలిపారు. ఏ దర్శకుడు కూడా దానిని తీయమని అడగలేదని, బి. గోపాల్ వంటి దర్శకులు సైతం దానిని కొనసాగించమని చెప్పారని సుధాకర్ గుర్తు చేసుకున్నారు.
షార్ట్ టెంపర్ అనే విమర్శలను ఖండిస్తూ, తాను ఫ్రాంక్‌గా మాట్లాడే వ్యక్తినని సుధాకర్ స్పష్టం చేశారు. ముందుగానే షెడ్యూల్ గురించి చెబితే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేసేవాడినని తెలిపారు. మోహన్ బాబు వంటి నటులు కూడా తన సౌకర్యాలను అడిగి తెలుసుకునేవారని చెప్పారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో, సూపర్ గుడ్ ఫిలిమ్స్‌లో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించినట్లు గుర్తు చేసుకున్నారు. ఎక్కువ సినిమాలు చేసి డబ్బు సంపాదించడం కంటే, వచ్చిన పాత్రకు న్యాయం చేసి, ప్రేక్షకులు ఆనందించేలా చేయడమే తన ధ్యేయమని సుధాకర్ వివరించారు. ముత్యాల సుబ్బయ్య వంటి దర్శకులు తనలో అపారమైన శక్తి ఉందని ప్రశంసించారని తెలిపారు. రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, ముప్పలనేని శివ, బి. గోపాల్, భీమనేని శ్రీనివాసరావు తనకు ఇష్టమైన దర్శకులని పేర్కొన్నారు.
సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో తలెత్తిన ఒంటరితనాన్ని తన కుమారుడు బెనడిక్ట్ మైఖేల్ (బెన్నీ)తో గడిపిన సమయంతో అధిగమించానని సుధాకర్ భావోద్వేగంగా చెప్పారు. తన కొడుకు పుట్టడానికి పదేళ్లు పట్టిందని, అందుకే వాడిపై తనకు అమితమైన ప్రేమ అని తెలిపారు. ప్రస్తుతం బెన్నీ CBITలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడని చెప్పారు. తాను మళ్ళీ సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని, మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని సుధాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రీ-ఎంట్రీ కోసం వెంకటేష్‌తో కలిసి మళ్ళీ పనిచేయాలని ఉందని, ఆయన చాలా సరదాగా ఉంటారని వివరించారు. తన ఆరోగ్యం బాగోలేనప్పుడు చిరంజీవి కుటుంబంతో సహా వచ్చి పరామర్శించారని, కోటి, జగపతి బాబు, తనికెళ్ళ భరణి వంటి వారు కూడా వచ్చి ధైర్యం చెప్పారని సుధాకర్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ఆఫీస్‌కు వెళ్ళినప్పుడు తన కుమారుడి సీటు విషయంపై కూడా ఆయన సహాయం చేశారని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..
