AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayyappa Song : మల్లెపువ్వు పల్లకి పాట కాదు.. ఇప్పుడు యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న అయ్యప్ప సాంగ్ ఇదే..

కార్తీక మాసం మొదలైంది. అటు అయ్యప్ప దీక్షా సమయం సైతం వచ్చేసింది. ఎంతో మంది భక్తి శ్రద్ధలతో అయ్యప్పను కోలుస్తూ మాలలు ధరిస్స్తున్నారు. అయితే ఎప్పటినుంచో ఎంతో ఇష్టంగా వినే 'మల్లెపువ్వు పల్లకి' పాటతో పాటు, ఇప్పుడు యూట్యూబ్‌లో కోట్లాది మంది భక్తులను ఆకట్టుకుంటున్న ఓ అద్భుతమైన 'శరణం అయ్యప్ప' భక్తిగీతం ట్రెండింగ్‌లో నిలిచింది. మనసును కట్టిపడేసే సాహిత్యం, శరణఘోషతో నిండిన ఈ పాట గురించి తెలుసుకుందామా.

Ayyappa Song : మల్లెపువ్వు పల్లకి పాట కాదు.. ఇప్పుడు యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న అయ్యప్ప సాంగ్ ఇదే..
Ayyappa Song
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2026 | 3:32 PM

Share

కార్తీక మాసం వచ్చిందంటే చాలు తెలుగు లోగిళ్లు, ఆలయాలు ‘స్వామియే శరణం అయ్యప్ప’ నామస్మరణతో మార్మోగిపోతాయి. అయ్యప్ప భక్తులు మాల ధరించి, శబరిమల యాత్రకు సిద్ధమయ్యే వేళ భక్తిగీతాలు మరింత ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎన్నో దశాబ్దాలుగా అయ్యప్ప పాటలంటే మనకు వెంటనే గుర్తొచ్చే పాటల్లో ‘మల్లెపువ్వు పల్లకిలో…’ ఒకటి. ఈ పాటకు జనాల్లో ఉంటే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక మొన్నటివరకు ఇరుముడితో ఈ పాట అటు థియేటర్లలోనూ మారుమోగింది. ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు ఆ పాటతో పాటు యూట్యూబ్‌లో కోట్లాది మంది భక్తుల హృదయాలను గెలుచుకుంటూ, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ట్రెండ్ అవుతున్న ఓ అద్భుతమైన అయ్యప్ప సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసుకుందామా.

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

ఆ పాట మరెదో కాదు.. “నీవే తల్లిగ తండ్రిగ తోడై నన్ను నడిపించు మణికంఠ.. కష్టాలే తరిమినా కన్నీరే ముంచినా నీవే నాకు దిక్కు కదా అయ్యప్ప” అంటూ సాగే చరణాలు ప్రతి భక్తుడి గుండెను తాకుతాయి. కష్టాల్లోనూ, కన్నీళ్లలోనూ స్వామి ఆసరాగా నిలుస్తాడనే నమ్మకాన్ని ఈ పాట ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తుంది. అంతేకాకుండా శ్లోకాలు, ‘శరణమయ్యప్ప’ నామస్మరణ కలగలిసిన తీరు శ్రోతలకు దివ్యానుభూతిని కలిగిస్తుంది. “కర్మ ప్రాప్తి కరుగునంట నిన్ను కొలువగా.. ఇక పుణ్యఫలము కలుగు నంట పూజ చేయగా” అంటూ సాగే భావాలు స్వామి నామస్మరణలో ఉన్న శక్తిని గుర్తు చేస్తాయి.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

ఎదలో ఎన్ని బాధలు ఉన్నా ఆ స్వామిని తలుచుకోగానే మనసు ప్రశాంతంగా మారుతుందనే భావన ఈ పాటలో ప్రముఖంగా కనిపిస్తుంది. సాధారణంగా భక్తి గీతాలు అంటే నిర్దిష్టమైన సీజన్ లేదా పూజల సమయంలో మాత్రమే వింటుంటారు. కానీ ఈ పాటలోని సంగీతం, గానం, భావాలు ఎప్పుడూ వినాలనిపించేలా ఉండటంతో యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే సుమారు 1.92 కోట్లకు పైగా వ్యూస్‌తో, వేలాది లైకులతో భక్తి సంగీత ప్రియుల ఫేవరెట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. ఈ అయ్యప్ప పాటను మీరు కూడా ఒకసారి వింటే, ఆ భక్తిభావానికి మళ్లీ మళ్లీ వినాలనిపించడం ఖాయం.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

అయ్యప్ప సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
ఏముంటంది భయ్యా ఈ పాట.. వింటూ ఉండిపోవాల్సిందే..
ఏముంటంది భయ్యా ఈ పాట.. వింటూ ఉండిపోవాల్సిందే..
సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే..అలాంటి వాటిని కట్టడి చేయండి
సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే..అలాంటి వాటిని కట్టడి చేయండి
తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం.. పల్నాడు తాగునీటి ప్రాజెక్టుతో
తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం.. పల్నాడు తాగునీటి ప్రాజెక్టుతో
హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించేందుకు పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా..?
హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించేందుకు పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా..?
ప్రమోషన్స్ అప్పుడే మొదలుపెట్టేశారే.. దళపతి సీన్ రీక్రియేట్..
ప్రమోషన్స్ అప్పుడే మొదలుపెట్టేశారే.. దళపతి సీన్ రీక్రియేట్..
అనవసరమైన విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? శ్రీకృష్ణుడు చెప్పిన..
అనవసరమైన విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? శ్రీకృష్ణుడు చెప్పిన..
22 క్యారెట్లు vs 24 క్యారెట్లు.. నగలు, పెట్టుబడికి ఏది కొంటే..
22 క్యారెట్లు vs 24 క్యారెట్లు.. నగలు, పెట్టుబడికి ఏది కొంటే..
తీరం దిశగా దూసుకొస్తున్న అక్వాన్.. తెలంగాణలో కూడా వర్షాలు
తీరం దిశగా దూసుకొస్తున్న అక్వాన్.. తెలంగాణలో కూడా వర్షాలు
నూడుల్స్ లవర్స్‌కి దిమ్మతిరిగే నిజాలు.. షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
నూడుల్స్ లవర్స్‌కి దిమ్మతిరిగే నిజాలు.. షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!