AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోవడం చాలా ఈజీ.. జస్ట్ పేరు, మొబైల్ నెంబర్ టైప్ చేస్తే క్షణాల్లోనే..

RBI: చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ప్రస్తుత కాలంలో ఉపయోగిస్తున్నారు. వివిధ అవసరాల కోసం వేర్వేరు బ్యాంక్ అకౌంట్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఒకటి లేదా రెండు అకౌంట్లను ఉపయోగిస్తూ మిగతా అకౌంట్ల గురించి పట్టించుకోవడం మానేస్తారు. కొన్నేళ్ల తర్వాత ఆ బ్యాంక్ వివరాలు కూడా మర్చిపోతారు.

పాత బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోవడం చాలా ఈజీ.. జస్ట్ పేరు, మొబైల్ నెంబర్ టైప్ చేస్తే క్షణాల్లోనే..
Bank Account
Venkatrao Lella
|

Updated on: Nov 19, 2026 | 3:37 PM

Share

మూడేళ్ల పాటు మీరు అకౌంట్ నుంచి ఎలాంటి లావాదేవీలు చేయకపోయినా లేదా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోయినా మీ బ్యాంక్ అకౌంట్‌ను సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ చేస్తుంది. కేవైసీ పూర్తి చేసుకోవాలని లేదా బ్యాంక్ అకౌంట్ నుంచి ఏదొక లావాదేవీ చేయకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందని బ్యాంకులు మెస్సేజ్‌ల రూపంలో ముందుగానే హెచ్చరిస్తుంటాయి. మీరు వెంటనే చర్య తీసుకోకపోతే అకౌంట్ ఇనాక్టివ్‌గా పరిగణిస్తారు. ఈ అకౌంట్ నుంచి మీరు ఎలాంటి లావాదేవీలు చేయలేరు. మళ్లీ బ్యాంక్‌కు వెళ్లి అవసరమైన పత్రాలను సమర్పించి కేవైసీ పూర్తి చేసుకుంటే యాక్టివ్ అవుతుంది. అయితే మీరు పదేళ్ల పాటు అకౌంట్‌ను వాడకుండా అలాగే వదిలేస్తే మీ అకౌంట్లోని సొమ్ము ఆర్బీఐ ప్రత్యేక ఫండ్‌లోకి వెళ్తుంది. ఇలాంటి సమయంలో మీరు తిరిగి వడ్డీతో సహా వాటిని తీసుకోవచ్చు. అలాంటి పాత బ్యాంక్ అకౌంట్లను గుర్తించే వ్యవస్థను ఆర్బీఐ తీసుకొచ్చింది.

పాత బ్యాంక్ అకౌంట్లను గుర్తించడం ఎలా..?

ఖాతాదారులు తమ పాత బ్యాంక్ అకౌంట్లను సులువుగా గుర్తించేందుకు వీలుగా UDGAM పోర్టల్ ఆర్బీఐ ప్రవేశపెట్టింది. పాత ఖాతాలను గుర్తించడంతో పాటు బ్యాంకుల్లో 10 సంవత్సరాలకుపైగా ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను సులువుగా ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంక్‌కు వెళ్లి ఆధార్, పాన్ లాంటి ధృవీకరణ పత్రాలను సమర్పించి తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ చేసుకోవడంతో పాటు అందులోని సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు. UDGAM వెబ్‌సైట్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్ పేరు, పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ పాత బ్యాంక్ అకౌంట్ వివరాలు పొందవచ్చు. పాత బ్యాంక్ అకౌంట్లలోని సొమ్మును ఖాతాదారులు తిరిగి పొందేలా సహాయపడేందుకు ఆర్బీఐ ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చింది.

పాత బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోవడమెలా..?

-https://udgam.rbi.org.in వెబ్‌సైట్‌ను సందర్శించండి

-మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ చేయండి

– ఖాతాదారుని పేరు, చిరునామా, పుట్టిన తేదీ, పాన్ కార్డు వివరాలను నమోదు చేయండి

-మీ బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి అవసరమైన KYC పత్రాలను సమర్పించండి

-అందులోని మీ డబ్బులను వడ్డీతో సహా తీసుకోండి

-మరణించిన వ్యక్తి ఖాతాలోని సొమ్మును నామినీ తీసుకోవచ్చు. ఇందుకు మరణించిన వ్యక్తి డెట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.

ఎలా క్లెయిమ్ చేసుకోవాాలి?

-మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లండి

-ఆధార్, పాన్ అందించండి

-మీ అకౌంట్‌ను యాక్టివ్ చేయమని అడగండి

-విత్ డ్రా ఫారం నింపి మీ డబ్బులు విత్ డ్రా చేసుకోండి

Follow Us
కార్తీక పౌర్ణమి రోజున ఈ తప్పులు చేయకండి.. తులసి నుంచి ఆహారం వరకు
కార్తీక పౌర్ణమి రోజున ఈ తప్పులు చేయకండి.. తులసి నుంచి ఆహారం వరకు
మీ పేరుతో పాత బ్యాంక్ అకౌంట్ ఉందా..? క్షణాల్లోనే వివరాలు..
మీ పేరుతో పాత బ్యాంక్ అకౌంట్ ఉందా..? క్షణాల్లోనే వివరాలు..
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
ఏముంటంది భయ్యా ఈ పాట.. వింటూ ఉండిపోవాల్సిందే..
ఏముంటంది భయ్యా ఈ పాట.. వింటూ ఉండిపోవాల్సిందే..
సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే..అలాంటి వాటిని కట్టడి చేయండి
సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే..అలాంటి వాటిని కట్టడి చేయండి
తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం.. పల్నాడు తాగునీటి ప్రాజెక్టుతో
తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం.. పల్నాడు తాగునీటి ప్రాజెక్టుతో
హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించేందుకు పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా..?
హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించేందుకు పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా..?
ప్రమోషన్స్ అప్పుడే మొదలుపెట్టేశారే.. దళపతి సీన్ రీక్రియేట్..
ప్రమోషన్స్ అప్పుడే మొదలుపెట్టేశారే.. దళపతి సీన్ రీక్రియేట్..
అనవసరమైన విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? శ్రీకృష్ణుడు చెప్పిన..
అనవసరమైన విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? శ్రీకృష్ణుడు చెప్పిన..
22 క్యారెట్లు vs 24 క్యారెట్లు.. నగలు, పెట్టుబడికి ఏది కొంటే..
22 క్యారెట్లు vs 24 క్యారెట్లు.. నగలు, పెట్టుబడికి ఏది కొంటే..