AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ఒక్కపూట అన్నం పెట్టిన మహిళ.. జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్.. ఏంటంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్టైల్, మేనరిజంకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ రజినీ హీరోనే. ఈ విషయాన్ని చాలా మంది అనేక సందర్భాల్లో వెల్లడించారు.

Rajinikanth: ఒక్కపూట అన్నం పెట్టిన మహిళ.. జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్.. ఏంటంటే..
Rajinikanth
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2026 | 3:57 PM

Share

సినీ ప్రపంచంలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న రజినీకాంత్ క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్, తన గతాన్ని, తనకు అండగా నిలిచిన వారిని ఎన్నడూ మర్చిపోలేదు. ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టే ఓ సంఘటన తాజాగా తెరపైకి వచ్చింద. ఇది ఆయనలోని మానవత్వాన్ని, కృతజ్ఞతా భావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. తన కష్టతరమైన ప్రారంభ రోజుల్లో, శివాజీ రావు గైక్వాడ్ స్నేహితుడు విఠల్ ప్రసాద్ ఇంట్లో ఆశ్రయం పొందేవారు. విఠల్ ప్రసాద్ తల్లి రజినీకాంత్ ను తన సొంత కొడుకులాగే చూసుకుని, ఆయన ఆకలి తీర్చేవారు. ఆ మాతృ ప్రేమ, ఆదరణ రజినీకాంత్ జీవితంలో చెరగని ముద్ర వేశాయి. రజినీకాంత్ సినీ రంగంలో గొప్ప తారగా ఎదిగిన తర్వాత, తాను అద్దె ఇంట్లో ఉన్నప్పుడు తనకు అన్నం పెట్టిన విఠల్ ప్రసాద్ తల్లిని మర్చిపోలేదు. ఆయన తన గొప్ప మనసును చాటుకుంటూ, ఆ అద్దె ఇంటిని కొనుగోలు చేసి, విఠల్ ప్రసాద్ తల్లికి బహుమతిగా ఇచ్చారు. ఈ పని రజినీకాంత్ ఎంత గొప్ప మనసున్న వ్యక్తిని మరోసారి రుజువు చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

కేవలం ఒక ఇల్లు ఇవ్వడం కాదు, తన కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన మాతృమూర్తి పట్ల ఆయనకు ఉన్న అపారమైన కృతజ్ఞతకు నిదర్శనం. ఇదే సందర్భంలో, రజినీకాంత్, విఠల్ ప్రసాద్ ల బాల్య స్మృతులు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. బస్సులో ప్రయాణించడానికి వారి తల్లి డబ్బులు ఇచ్చేదట. ఆ రోజుల్లో రజినీకాంత్ ను దగ్గరగా చూసిన వారిలో ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ తో పనిచేసిన ఒక అసోసియేట్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో విద్యార్థులను కలుస్తున్నప్పుడు, విఠల్ ప్రసాద్ ద్వారా శివాజీ రావు గైక్వాడ్ ను (రజినీకాంత్ ను) పరిచయం చేశారని చెబుతారు. అప్పటి రజినీకాంత్ ను వర్ణిస్తూ, “ఒక మామూలు హెయిర్ చాలా డిస్టర్బ్డ్ గా పెట్టుకుంటాడు కదా. హెయిర్… తర్వాత చిన్న చిన్న కళ్ళు, ఒక ఎలక ముక్కులాగా చిన్న ముక్కు. షార్ప్ నోస్” అని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో హీరోలు అంటే ఎన్.టి. రామారావు, కృష్ణ, శోభన్ బాబు వంటి అందగాళ్ళు ఉంటారు అని అందరూ అనుకునేవారని, కానీ రజినీకాంత్ సాధారణ రూపంలోనే కనిపించారని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

రాజా టాక్స్ ఐడి వంటి వేదికలు ఇలాంటి అద్భుతమైన జీవిత కథలను, సెలబ్రిటీల వ్యక్తిగత అనుభవాలను వెలుగులోకి తీసుకువస్తాయి. రజినీకాంత్ కథ కేవలం ఆయన స్టార్‌డమ్‌ను మాత్రమే కాదు, ఆయనలో ఉన్న నిరాడంబరత, దయ, కృతజ్ఞతా భావాలను కూడా తెలియజేస్తుంది. ఇది ఆయనను కోట్ల మంది అభిమానుల హృదయాల్లో నిజమైన సూపర్ స్టార్ గా నిలబెట్టింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే వి.ఎస్. బాబు మృతి
స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే వి.ఎస్. బాబు మృతి
ఒక్కపూట అన్నం పెట్టిన మహిళకు రజినీకాంత్ ఇచ్చిన బహుమతి ఏంటంటే..
ఒక్కపూట అన్నం పెట్టిన మహిళకు రజినీకాంత్ ఇచ్చిన బహుమతి ఏంటంటే..
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్‌!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్‌!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!
దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో
దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో
కార్తీక పౌర్ణమి రోజున ఈ తప్పులు చేయకండి.. తులసి నుంచి ఆహారం వరకు
కార్తీక పౌర్ణమి రోజున ఈ తప్పులు చేయకండి.. తులసి నుంచి ఆహారం వరకు
మీ పేరుతో పాత బ్యాంక్ అకౌంట్ ఉందా..? క్షణాల్లోనే వివరాలు..
మీ పేరుతో పాత బ్యాంక్ అకౌంట్ ఉందా..? క్షణాల్లోనే వివరాలు..
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
ఏముంటంది భయ్యా ఈ పాట.. వింటూ ఉండిపోవాల్సిందే..
ఏముంటంది భయ్యా ఈ పాట.. వింటూ ఉండిపోవాల్సిందే..
సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే..అలాంటి వాటిని కట్టడి చేయండి
సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే..అలాంటి వాటిని కట్టడి చేయండి
తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం.. పల్నాడు తాగునీటి ప్రాజెక్టుతో
తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం.. పల్నాడు తాగునీటి ప్రాజెక్టుతో