AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..

సోషల్ మీడియాలో బిగ్ బాస్ రియాల్టీ షో సందడి మొదలైంది. ఇటీవల వరుస ప్రోమోలతో ఆసక్తి క్రియేట్ చేశారు నాగార్జున. ఇక ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు అగ్నిపరీక్ష కోసం అప్లై చేసుకోగా.. త్వరలోనే ఈ షో స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన రానుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా పలువురు సెలబ్రెటీల పేర్లు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే.

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..
Bigg Boss 10 Telugu
Rajitha Chanti
|

Updated on: Jul 18, 2026 | 5:43 PM

Share

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 10 సందడి మొదలైంది. ఓవైపు అగ్నీ పరీక్ష కోసం అడిషన్స్ జరుగుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు సెలబ్రెటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సీరియల్ బ్యూటీ పేరు నెట్టింట మారుమోగుతుంది. స్మాల్ స్క్రీన్ పై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సూపర్ హిట్ సీరియల్ ‘గుప్పెడంత మనసు’. సంవత్సరాలపాటు ఈ సీరియల్ భారీ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోయింది. ఈ సీరియల్‌లో వసుధార పాత్రతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిపోయింది నటి రక్షా గౌడ (Raksha Gowda). తనదైన సహజ నటనతో, పద్ధతైన పాత్రతో భారీ పాపులారిటీని సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సాధారణంగా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రతి సీజన్‌లోనూ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన సెలబ్రిటీలను హౌస్‌లోకి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే, ప్రస్తుతం విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న రక్షా గౌడను ఈ రియాలిటీ షోలోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయి.

ఎక్కువ మంది చదివినవి : Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

సీరియల్‌లో ఎంతో పద్ధతిగా, పట్టుదల గల అమ్మాయిగా కనిపించిన వసుధార.. రియల్ లైఫ్‌లో బిగ్ బాస్ లాంటి కాంట్రవర్షియల్ , మైండ్ గేమ్ షోలో ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత చాలాకాలం పాటు తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉంది. అయితే ఆ తర్వాత చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ దారవాహికను త్వరలోనే ముగించేసారు. ఇక ఇప్పుడు రక్ష గౌడ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టనుందని టాక్. అంతేకాకుండా.. ఈసారి ఆమెకు అత్యధిక రెమ్యునరేషన్ ఇవ్వడం ఖాయమని.. ఇక ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 6 కోట్లతో తీస్తే రూ.16 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..

గుప్పెడంత మనసు సీరియల్లో హీరో రిషితో రక్షా పండించిన కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే, ఇప్పుడు ఆమె సోలోగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి తన అసలైన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమవుతోంది. 24 గంటల పాటు కెమెరాల నిఘాలో ఉంటూ, టాస్క్‌లలో పాల్గొంటూ రక్షా గౌడ తన ఇమేజ్‌ను మరింత పెంచుకునే అవకాశం ఉంది. గుప్పెడంత మనసు సీరియల్ ముగియడంతో నిరాశలో ఉన్న అభిమానులకు, ఆమె బిగ్ బాస్ లోకి రాబోతుండటం పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఈ హౌస్‌లో రక్షా గౌడ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి!

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

వసుధార పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

Follow Us