AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ తెలుగు 10 నుంచి సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే.?

బిగ్ బాస్ 10 నుంచి మోడల్ సృష్టి వ్యాకరణం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. నాలుగో వారంలో ఆమెకు తక్కువ ఓట్లు రావడంతో హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. సుధీర్‌తో జరిగిన గొడవ, నాగార్జున ఇచ్చిన వార్నింగ్, అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ వరకు ఆమె ప్రయాణం, నాలుగు వారాల రెమ్యునరేషన్ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 10 నుంచి సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే.?
Biggboss 10
Rajeev Rayala
|

Updated on: Oct 04, 2026 | 6:54 PM

Share

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌లో మరో కీలక ఎలిమినేషన్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత అగ్నిపరీక్ష ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సృష్టి వ్యాకరణం.. బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రయాణాన్ని ముగించినట్లు సమాచారం. నాలుగో వారంలో జరిగిన ఎలిమినేషన్‌లో ఆమెకు తక్కువ ఓట్లు రావడంతో బయటకు వెళ్లాల్సి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత సృష్టి వ్యాకరణం తనదైన శైలిలో గేమ్ ఆడేందుకు ప్రయత్నించింది. అయితే హౌస్‌లో ఆమెకు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి మద్దతు లభించలేదనే టాక్ వినిపించింది. ముఖ్యంగా నామినేషన్ సమయంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు ఆమె ఓట్లు తక్కువ పడేలా చేశాయని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు 10 నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో సృష్టి వ్యాకరణం, దేబ్జానీ, అమన్ తదితరులు డేంజర్ జోన్‌లో ఉన్నారు. మొదట్లో ఓటింగ్ లెక్కల్లో సృష్టి కొంత వెనుకబడినట్లు వార్తలు వచ్చాయి. చివరి వరకు ఓటింగ్ ట్రెండ్స్‌లో మార్పులు కనిపించినప్పటికీ.. చివరకు సృష్టి ఎలిమినేట్ అయినట్లు సమాచారం.

చిరంజీవి, వెంకటేష్‌లతో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? సోషల్ మీడియాను ఊపేస్తుందిగా..

ప్రేక్షకుల ఓట్లే ఆమె ఎలిమినేషన్‌కు ప్రధాన కారణంగా నిలిచాయని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. హౌస్‌లో సృష్టి వ్యాకరణం ప్రయాణంలో సుధీర్‌తో జరిగిన వివాదం ఎక్కువగా చర్చకు వచ్చింది. నామినేషన్ సమయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో సృష్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సుధీర్‌పై సృష్టి చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోపంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమె ప్రవర్తనపై హౌస్‌లోనూ బయటా చర్చ జరిగింది. ఈ ఘటన తర్వాత సృష్టి గేమ్‌పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయని బిగ్ బాస్ వర్గాల్లో టాక్ వినిపించింది.

ఎవర్రా నువ్వు..! బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవల్

ముఖ్యంగా రెండో వారంలో ఆమె గేమ్‌పై ఫోకస్ పెంచుకోవాలని హోస్ట్ నాగార్జున సూచించారు. సృష్టి వ్యాకరణం మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అక్కడ తన టాలెంట్‌ను చూపించి బిగ్ బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టే అవకాశాన్ని సంపాదించుకుంది. సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ హౌస్‌లో వారానికి సుమారు రూ.75 వేల రెమ్యునరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్క ప్రకారం నాలుగు వారాలకు ఆమెకు దాదాపు రూ.3 లక్షల వరకు పారితోషికం వచ్చినట్లు చెప్పొచ్చు. అదే సమయంలో ‘అగ్నిపరీక్ష’ నుంచి ఆమెకు సుమారు రూ.50 వేల వరకు పారితోషికం లభించిందనే సమాచారం కూడా ప్రచారంలో ఉంది. ఈ రెండు కలిపి చూస్తే సృష్టి వ్యాకరణం టెలివిజన్ రియాలిటీ షోల ద్వారా సుమారు రూ.3.50 లక్షల వరకు సంపాదించి ఉండొచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి

10th క్లాస్ మూడుసార్లు ఫెయిల్ అయ్యా.. ఖచ్చితంగా డైరెక్టర్ అవుతానంటున్న స్టార్ హీరో కూతురు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us