AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి, వెంకటేష్‌లతో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? సోషల్ మీడియాను ఊపేస్తుందిగా..

చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. మన శంకరవరప్రసాద్ గారు ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో వరుసగా సినిమాఉల చేస్తున్నారాయన. ప్రస్తుతం చిరంజీవి బాబీ కొల్లి తో కాకా, వశిష్టతో విశ్వంభర, శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు చేయనున్నాడు. అయితే ఇంత బిజీ షెడ్యూల్ లోనూ చిరంజీవి ఓ టాక్ షో చేయనున్నాడని తెగ ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి, వెంకటేష్‌లతో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? సోషల్ మీడియాను ఊపేస్తుందిగా..
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 03, 2026 | 12:24 PM

Share

టాలీవుడ్‌లో స్టార్ హీరోలు కనిపించే పాటల్లో అప్పుడప్పుడు కొందరు డ్యాన్సర్లు ప్రత్యేకంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. పాటలో ప్రధానంగా కనిపించకపోయినా.. తమ స్టైల్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఒక్కసారిగా అందరి చూపును తమవైపు తిప్పుకుంటారు. ఇటీవల చాలా మంది అందాల భామలు ఇలా పాపులార్ అయ్యారు. అలాగే మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి కనిపించిన పాటలో ఓ యువతి కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని పాటలో చిరంజీవి, వెంకటేష్‌తో పాటు ఈ అమ్మడు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు అంజలి. ఈ సాంగ్ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

300లకు పైగా సినిమాలు.. తొలి సినిమాకే రూ. 15 రెమ్యునరేషన్.. ఈ హీరోయిన్ రేంజే వేరు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి టైటిల్ రోల్‌లో నటించారు. నయనతార కథానాయికగా నటించగా, వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పాటలు కూడా విడుదలకు ముందే మంచి ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ కలిసి కనిపించిన మెగా విక్టరీ మాస్ సాంగ్ లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లతో కలిసి పలువురు పెర్ఫార్మర్లు సందడి చేశారు. ఈ పాటలో అంజలి కూడా కనిపించింది.

ఇవి కూడా చదవండి

కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్స్ ఈ భామలు..! ఒకప్పుడు ఊపేశారు.. కానీ ఆతర్వాత సినిమాలు ఆపేశారు

స్టార్ హీరోలతో ఉన్న ఫ్రేమ్‌లో ఆమె లుక్, డ్యాన్స్ చూసిన పలువురు ప్రేక్షకులు ఈ అమ్మాయి ఎవరు.? అంటూ సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు. అంజలి ఇప్పటికే కొన్ని సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కనిపించి ఆకట్టుకుంది. తెలుగు సినిమాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ ఆమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకున్నాయి. సినిమాల్లో కనిపించడంతో పాటు అంజలి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోలు, వీడియోలు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఫస్ట్ సినిమాకు రూ. 70లక్షలు అందుకుంది.. దెబ్బకు రెండు సినిమాలకే కనిపించకుండా పోయింది.

View this post on Instagram

A post shared by Anjali Jha (@jha_anjali04__)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us