AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్స్ ఈ భామలు..! ఒకప్పుడు ఊపేశారు.. కానీ ఆతర్వాత సినిమాలు ఆపేశారు

టాలీవుడ్ లో ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్స్ గా రాణించారు. తమ అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ వయ్యారి భామలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్స్ ఈ భామలు..! ఒకప్పుడు ఊపేశారు.. కానీ ఆతర్వాత సినిమాలు ఆపేశారు
Tollywood
Rajeev Rayala
|

Updated on: Oct 02, 2026 | 11:04 AM

Share

సినిమా కెరీర్‌ను కేవలం సినిమాల సంఖ్యతో కొలవలేం. కొందరు నటీనటులు చాలా సినిమాలు చేసినా గుర్తుండిపోయే పాత్రలు తక్కువగా ఉంటాయి. మరికొందరు ఒకటి లేదా రెండు చిత్రాల్లో కనిపించినా ప్రేక్షకుల మదిలో ఎక్కువకాలం నిలిచిపోతారు. టాలీవుడ్‌లో ఇలాంటి ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు కొత్త హీరోయిన్లు వరుసగా సినిమాలు చేసేవారు. ఒక సినిమా విజయం సాధిస్తే వెంటనే మరో రెండు మూడు అవకాశాలు వచ్చేవి. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదే బెడిసికొడితే మెల్లగా కనిపించకుండా పోతుంటారు. అలాంటి వారిలో ఈ ముగ్గురు భామలు కూడా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మలు ఆడియన్స్ గుండెల్లో ప్రింట్ అయిపోయారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది. అందాల భామ నేహా శర్మ. ఈ చిన్నది చిరుత సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ  ఇచ్చింది. రామ్ చరణ్ తొలి చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఆమెకు ఆ సినిమా విజయం మంచి గుర్తింపును తెచ్చింది. దాంతో పాటు ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. కానీ తర్వాత నేహా నటించిన కుర్రాడు సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆతర్వాత ఈ ముద్దగుమ్మ బాలీవుడ్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టింది.

ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఆత్మహత్యకు ప్రయత్నించింది.. ఇప్పుడు ఇలా

అలాగే ఓయ్ సినిమా ద్వారా గుర్తింపు పొందిన షామిలి కూడా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయారు. బాలనటిగా ఇప్పటికే పరిచయం ఉన్నప్పటికీ హీరోయిన్‌గా ఆ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది. ఈ సినిమాలో ఇనోసెంట్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఆమె అమాయకపు నటన ఆడియన్స్ ను కట్టిపడేసింది. కానీ ఈ చిన్నది ఎక్కువ సినిమాలు చేయలేదు. తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..! కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు

అలాగే గౌరీ ముంజాల్‌.. బన్నీ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. అల్లు అర్జున్‌తో కలిసి చేసిన ఆ చిత్రం ఆమెకు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించినప్పటికీ బన్నీ స్థాయి గుర్తింపు మళ్లీ రాలేదు. దాంతో ఈ చిన్నది కనిపించకుండా పోయింది. ఇలా చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అయ్యారు. ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు.. ఆయన ఎవరంటే

నేహా శర్మ ఇన్ స్టా గ్రామ్.. 

గౌరీ ముంజాల్‌ ఇన్ స్టా గ్రామ్.. 

View this post on Instagram

A post shared by gaurimunjal (@gaurimunjal)

షామిలి ఇన్ స్టా గ్రామ్.. 

View this post on Instagram

A post shared by Shamlee (@shamlee_official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us