ఫస్ట్ సినిమాకు రూ. 70లక్షలు అందుకుంది.. దెబ్బకు రెండు సినిమాలకే కనిపించకుండా పోయింది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ స్టార్స్ గా రాణించి..ఆ తర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. తెలుగులో తోపు హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యారు. యంగ్ హీరోయిన్స్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ తెచ్చుకొని దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. కానీ కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం సినిమాల విషయంలో వెనకాల పడిపోతున్నారు. అలాగే కొంతమంది కనిపించకుండా మాయం అవుతున్నారు. ఇక ఇన్ కొంతమంది హీరోయిన్స్ భారీ రెమ్యునరేషన్స్ తో దూసుకుపోతున్నారు. హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇక ఓ అందాల భామ తొలి సినిమాకే రూ. 70లక్షల రెమ్యునరేషన్ అందుకుంది. కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసింది. అందులో ఓ సినిమా భారీ హిట్ అందుకుంది. మరో సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇంతకూ ఆ అందాల భామ ఎవరో తెలుసా.? ఇప్పుడు ఆ చిన్నది కోట్లకు మహారాణి. ఇంతకూ ఆమె ఎవరంటే..
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కత్రినా కైఫ్. ఈ ముద్దుగుమ్మకు తెలుగు ప్రేక్షకులతో ఉన్న అనుబంధం కూడా ప్రత్యేకమే. ఆమె హిందీ సినిమాల్లో కెరీర్ మొదలుపెట్టిన సమయంలోనే తెలుగులో హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మల్లీశ్వరి 2004లో విడుదలైంది. ఈ సినిమాతో కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటికి ఆమె కెరీర్ స్టార్టింగ్‌లోనే ఉంది. అయినప్పటికీ ఈ సినిమా కోసం ఆమెకు అందిన పారితోషికం గురించి ఇప్పటికీ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మల్లీశ్వరిలో హీరోయిన్‌గా నటించేందుకు కత్రినా సుమారు రూ.70 లక్షల పారితోషికం అందుకుందట. ఆ టైంలో రూ. 70లక్షలు అనేది చాలా ఎక్కువ.
సినిమాలో వెంకటేష్ కామెడీ టైమింగ్, స్టోరీ, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. కత్రినా గ్లామర్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదు ఈ ముద్దుగుమ్మ. మల్లీశ్వరి తర్వాత బాలకృష్ణతో అల్లరి పిడుగులో నటించింది. అదే ఆమె చివరి తెలుగు సినిమా.. తర్వాత కత్రినా పూర్తిగా బాలీవుడ్‌లో తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. అక్కడ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. హిందీ చిత్రసీమలో పెద్ద స్టార్‌గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాతి కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
