స్టార్ హీరోయిన్ కెరీర్‌లోనే బోల్డ్ మూవీ..! ఆ సీన్ చేయడానికి 2 నెలలు ఆలోచించా.. ఇంకొకసారి చేయనంటున్న బ్యూటీ
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొంతమంది సినిమాల కోసం రకరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. కొంతమంది డీ గ్లామర్ పాత్రలు అలాగే, బోల్డ్ సీన్స్ కూడా చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు.

సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.. కొన్ని సందర్భాల్లో నటీనటులకు తమను తాము సవాల్ చేసుకునే వేదికగా కూడా మారుతుంది. అలాంటి సవాలుతో కూడుకున్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన హీరోలు, హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో అందాల భామ అమలా పాల్ ఒకరు. ఆమె కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రాల్లో తమిళ సినిమా ఆడై, తెలుగులో ‘ఆమె’ ఒకటి. 2019లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో కథతో పాటు అమలా పాల్ చేసిన ఒక సాహసం కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలను గుర్తుచేసుకున్న అమలా పాల్.. ఆ పాత్రను అంగీకరించే ముందు తనలో జరిగిన సంఘర్షణ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆడై కథను దర్శకుడు రత్నకుమార్ చెప్పినప్పుడు తనకు ఒకవైపు కథపై ఆసక్తి కలిగిందని, మరోవైపు కీలకమైన సన్నివేశంపై ఎన్నో సందేహాలు తలెత్తాయని అమలా పాల్ గతంలో వెల్లడించారు.
300లకు పైగా సినిమాలు.. తొలి సినిమాకే రూ. 15 రెమ్యునరేషన్.. ఈ హీరోయిన్ రేంజే వేరు
సినిమాలో నగ్న సన్నివేశం ఎందుకు అవసరమో, అది కథలో భాగమా.? లేక సినిమా ప్రచారం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారా.? అనే ప్రశ్నలు తనను చాలాకాలం వెంటాడినట్లు ఆమె తెలిపారు. దర్శకుడి ఆలోచన, కథలోని సందర్భం, ఆ సన్నివేశం వెనుక ఉన్న ఎమోషన్ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సినిమాకు అంగీకరించినట్లు ఆమె చెప్పారు. తాను వెంటనే నిర్ణయం తీసుకోలేదని, దర్శకుడు రత్నకుమార్‌తో పాటు చిత్ర బృందంపై పూర్తి నమ్మకం ఏర్పడటానికి దాదాపు రెండు నెలల సమయం పట్టిందని అమలా పాల్ పేర్కొన్నారు.
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్స్ ఈ భామలు..! ఒకప్పుడు ఊపేశారు.. కానీ ఆతర్వాత సినిమాలు ఆపేశారు
ఒక నటిగా పాత్రకు అవసరమైన సన్నివేశాన్ని చేయడం ఒక విషయం అయితే.. దాని ప్రభావం తన కెరీర్‌పై ఎలా ఉంటుందనే ఆలోచన మరోవైపు ఉందని ఆమె వివరించారు. ముఖ్యంగా ప్రేక్షకులు తనను ఒకే తరహా పాత్రలకు పరిమితం చేస్తారేమోనన్న భయం కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో తనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శకుడు, కెమెరా విభాగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని అమలా పాల్ తెలిపారు. సెట్‌లో అవసరమైనంత తక్కువ మంది సిబ్బందినే ఉంచారని, తన వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యత ఇచ్చారని ఆమె చెప్పారు. అందువల్లే ఆ సన్నివేశాన్ని నటిగా పూర్తి చేయగలిగానని వివరించారు. తనకు అది కేవలం సెన్సేషన్ కోసం చేసిన సన్నివేశం కాదని, పాత్రలోని భావోద్వేగాన్ని తెరపై నిజాయితీగా చూపించేందుకు చేసిన ప్రయత్నమని అమలా పాల్ అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మాత్రం అలాంటి సాహసం మరోసారి చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు అమలా పాల్ స్పష్టం చేశారు.
ఫస్ట్ సినిమాకు రూ. 70లక్షలు అందుకుంది.. దెబ్బకు రెండు సినిమాలకే కనిపించకుండా పోయింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
