వెంకటేష్‌కు కూతురిగా ప్రేయసిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆ తర్వాత కలిసి నటించలేదు
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాకు ‘హౌస్ నెంబర్ 47’ అనేది ట్యాగ్ లైన్‌గా వ్యవహరిస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు , అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు తెరపై మాత్రమే కాదు.. వాటి వెనుక ఉన్న కథలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఒకప్పుడు బాలనటులుగా కలిసి కనిపించిన నటీనటులు, కొన్నేళ్ల తర్వాత హీరోహీరోయిన్లుగా నటించిన సందర్భాలు సినీ చరిత్రలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరోలతో బాలనటులుగా నటించిన కొందరు హీరోయిన్లు.. ఆ తర్వాత అదే హీరోల సరసన ప్రియురాలిగా, భార్యగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇలాంటి అరుదైన కాంబినేషన్లలో నందమూరి తారక రామారావు, శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరరావు ఇలా కొంతమంది కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇదే తరహాలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు వెంకటేష్, శ్రీదేవి. అందాల తార శ్రీదేవి చిన్నతనంలోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. బాలనటిగా తెలుగు, తమిళం సహా పలు భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
300లకు పైగా సినిమాలు.. తొలి సినిమాకే రూ. 15 రెమ్యునరేషన్.. ఈ హీరోయిన్ రేంజే వేరు
1972లో విడుదలైన తమిళ చిత్రం ‘వసంత మాళిగై’ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో తెరకెక్కిన ప్రేమనగర్ తమిళ రీమేక్‌గా రూపొందింది. తమిళంలో శివాజీ గణేశన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో బాలనటిగా కనిపించిన శ్రీదేవి ఒక చిన్నారి పాత్రను పోషించారు. అదే సమయంలో బాల నటుడిగా వెంకటేష్ కూడా ఆ సినిమాలో కనిపించారు. కథలోని పాత్రల సంబంధాల ప్రకారం శ్రీదేవి పోషించిన చిన్నారి పాత్రకు వెంకటేష్ బాబాయి వరుసలో కనిపించడం విశేషం.అంటే.. ఒకే సినిమాలో శ్రీదేవి చిన్నారి పాత్రలో ఉంటే, వెంకటేష్ ఆమెకు బాబాయి వరుసలో కనిపించారు.
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్స్ ఈ భామలు..! ఒకప్పుడు ఊపేశారు.. కానీ ఆతర్వాత సినిమాలు ఆపేశారు
బాలనటులుగా కనిపించిన ఆ ఇద్దరూ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హీరోహీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే 1991లో వచ్చిన క్షణ క్షణం సినిమా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు ప్రేక్షకులను కొత్త తరహా థ్రిల్లర్ అనుభూతికి గురిచేసింది. వెంకటేష్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. వెంకటేష్, శ్రీదేవి కలిసి నటించిన సినిమాగా ‘క్షణ క్షణం’ ఒక్కటే నిలిచింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి నటించలేదు. ఇలా వెంకీ, శ్రీదేవి ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నాటింకేసి ఆతర్వాత హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇలా వెంకీకి శ్రీదేవి కూతురిగా అలాగే ప్రేయసిగా నటించారు.
ఫస్ట్ సినిమాకు రూ. 70లక్షలు అందుకుంది.. దెబ్బకు రెండు సినిమాలకే కనిపించకుండా పోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




