అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాను హీటెక్కిస్తోన్న హీరోయిన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

20  July 2026

తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది హీరోయిన్ లక్ష్మీ రాయ్. అయినప్పటికీ ఆమె ఖాతాలో పెద్దగా విజయం మాత్రం పడలేదు.

కానీ ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట హీటెక్కిస్తుంది. తాజాగా ఆమె లేటేస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.

సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా అటు నార్త్ ఇండస్ట్రీలో బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా ఆమెకు నిరాశే మిగిలింది.

సినిమా రంగంలో అవకాశాలు పెద్దగా లేకపోయినా, సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే రాయ్ లక్ష్మి, ఇన్‌స్టాలో క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు తెల్లని ఆఫ్-షోల్డర్ క్రాప్ టాప్, స్కర్ట్ ధరించి గ్లామరస్‌గా పోజులిచ్చింది. గాలికి ఎగిరే అందమైన జుట్టు, రూపం కట్టిపడేస్తున్నాయి.

2005లో తమిళ చిత్రం 'కర్క కసదర' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అదే ఏడాది శ్రీకాంత్ జోడిగా కాంచనమాల కేబుల్ టీవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

బాలకృష్ణతో 'అధినాయకుడు', రవితేజతో 'బలుపు', 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన స్పెషల్ సాంగ్స్‌ చేసింది. 

అయినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలతో రచ్చ చేస్తుంది ఈ వయ్యారి.