ప్రకృతి ఒడిలో  అనుపమ పరమేశ్వరన్‌ సరికొత్త లుక్స్..

19-07-2026

Pic credit - Instagram

Phani Ch

ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది.

ఆ సినిమా అక్కడ సూపర్ హిట్‌‌ అవ్వడంతో అనుపమకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. 

తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. 

టాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు ఓ ఊపు ఊపిన ఈ భామ.. సడెన్‌గా రేసులో వెనకబడింది. అయితే కార్తికేయ 2 సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

ఇప్పుడు తెలుగు, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ వయ్యారి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది.

చివరిగా తమిళ్ లో  బైసన్ సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ బైసన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది.