AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్ వదిలేసి తప్పు చేశాను.. కష్టాల్లో అతడు మాత్రమే ఆదుకున్నాడు.. కమెడియన్..

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ రియాలిటీ షో జబర్దస్త్. 2013 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ షో, అప్పటినుంచి ఇప్పటివరకు టెలివిజన్ రేటింగ్స్ లో దూసుకుపోతూ, తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ షో ఎంతో మంది సాధారణ కళాకారులను స్టార్ కమెడియన్లుగా మార్చింది.

జబర్దస్త్ వదిలేసి తప్పు చేశాను.. కష్టాల్లో అతడు మాత్రమే ఆదుకున్నాడు.. కమెడియన్..
Comedian Tanmay
Rajitha Chanti
|

Updated on: Jun 17, 2026 | 5:28 PM

Share

బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన కామెడీ షో ‘జబర్దస్త్’. ఈ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రిటీలుగా మారారు. వారిలో లేడీ కమెడియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తన్మయి ఒకరు. జబర్దస్త్ వేదికపై తన కామెడీ టైమింగ్‌తో నవ్వించిన తన్మయి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితంలోని తీవ్ర విషాదాలను పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన కెరీర్ ప్రారంభంలో నాగబాబు, రోజాతో పాటు దర్శకులు నితిన్, భరత్ ఎంతో మద్దతుగా నిలిచారని తన్మయి గుర్తుచేసుకున్నారు. అయితే, ఒకానొక సమయంలో యాజమాన్యానికి, కొందరు టీమ్ లీడర్లకు మధ్య విభేదాలు రావడంతో వేరే ఛానల్‌లో ‘అదిరింది’ అనే షో ప్రారంభమైంది.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..

ఆ సమయంలో కొందరు జబర్దస్త్ నటులు “తన్మయి.. నువ్వు అక్కడకు వస్తే నీకు ఇంకా మంచి లైఫ్ ఉంటుంది, మేము చూసుకుంటాం” అని అన్నారని.. వారి మాటలు నమ్మి జబర్దస్త్ వదిలేసి వెళ్లడం తాను చేసిన అతిపెద్ద తప్పు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ షో కేవలం ఒక ఏడాదిలోనే ముగిసిపోవడంతో, మాట ఇచ్చిన వారంతా వారి జీవితాల్లో బిజీ అయిపోయారని, తాను మాత్రం తీవ్రంగా నష్టపోయి ఒంటరినయ్యానని పేర్కొన్నారు. ఆ తర్వాత మళ్లీ మల్లెమాల టీమ్‌ను రిక్వెస్ట్ చేసుకుని జబర్దస్త్‌లోకి రావాల్సి వచ్చిందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన రెండేళ్లకు తన్మయి జీవితంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా జరిగిన కారు ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయమై, రైనోప్లాస్టీ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దాదాపు కోమాలోకి వెళ్లేంత పరిస్థితి వచ్చినా, తాను బ్రతికి ఉందో లేదో కూడా పరిశ్రమలో ఎవరూ పట్టించుకోలేదని కన్నీరు పెట్టుకున్నారు. గతంలో తాను ఎంతో మందికి సహాయం చేసినా, తనకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ అండగా నిలబడలేదని బాధపడ్డారు. తన్మయి జీవితంలో కోలుకోలేని మరో దెబ్బ తన తండ్రి అకస్మాత్తుగా మరణించడం. దిక్కుతోచని స్థితిలో తోటి కమెడియన్ కు ఫోన్ చేస్తే తాను షూటింగ్‌లో ఉన్నానని చెప్పాడట. కానీ, కమెడియన్ నూకరాజు మాత్రం తన షూటింగ్‌ను సైతం పక్కనబెట్టి, కారు తీసుకుని వచ్చి తన్మయికి తోడుగా నిలిచాడని.. హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్లేవరకు ఆమె చేయి పట్టుకుని “ఏడవకు, మేమున్నాం” అంటూ మానసికంగా, ఆర్థికంగా కొండంత అండగా నిలబడ్డాడని తన్మయి చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

తన్మయి పోస్ట్..

View this post on Instagram

A post shared by Sdp Prasad (@sdpprasad05)

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

Follow Us
జబర్దస్త్ వదిలేసి తప్పు చేశాను..
జబర్దస్త్ వదిలేసి తప్పు చేశాను..
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"డీల్ నచ్చకపోతే మళ్లీ బాంబులే!".. ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!