AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో పెరిగిపోతున్న స్లీప్ డివోర్స్ కేసులు.. అసలు కారణం ఏమిటంటే?

భారత్‌లో స్లీప్ డివోర్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడానికి జంటలు వేర్వేరు గదుల్లో నిద్రించడాన్ని 'స్లీప్ డివోర్స్' అంటారు. గురక, నిద్ర షెడ్యూల్స్, ఒత్తిడి వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఇది సంబంధాలను ప్రభావితం చేయకుండానే, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను అందిస్తుందని నిపుణులు అంటున్నారు.

Samatha J
|

Updated on: Mar 10, 2026 | 2:11 PM

Share
భారత్‌లో స్లీప్ డివోర్స్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, అసలు దీనికి కారణం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా మంది స్లీప్ డివోర్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బంధంలో బలంగా ఉన్నప్పటికీ, నిద్రపరంగా, ఆరోగ్యానికి ప్రాముఖ్యతను ఇస్తూ,  భాగస్వామి నిద్రకు బంగం కలగకుండా, స్లీప్ డివోర్స్ తీసుకొని , వేరు వేరుగా నిద్రపోవడం జరుగుతుంది. అయితే ఈ ట్రెండ్ ఎక్కువగా భారత్‌లోనే కొనసాగుుతందంట. దీనికి గల కారణాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
స్లీప్ డివోర్స్ అనే కొత్త ట్రెండ్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఇది భారతదేశంలో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక స్లీప్ డివోర్స్ అంటే, ఒకే రూమ్‌లో కాకుండా, వారి వారి నిద్రనాణ్యతను మెరుగు పరుచుకోవడానికి వేరు వేరు గదుల్లో నిద్రించడాన్ని  స్లీప్ డవోర్స్ అంటారు. అయితే తాజా నివేదికలో భారత దేశంలో సగంపైగా జంటలు స్లీప్ డివోర్స్ తీసుకొని, వేరు వేరు గదుల్లో నిద్రిస్తున్నట్లు వెల్లడైంది.

2 / 5
ముఖ్యంగా గురక, నిద్ర షెడ్యూల్స్, గదిలో లైటింగ్, బెడ్ రూమ్ వాతావరణం, పని ఒత్తిడి, జీవనశైలి వంటి పలు కారణాలు ఈ స్లీప్ డివోర్స్‌కు కారణం అవుతున్నాయంట. అయితే కాస్త ఇబ్బందికరంగా, ఆందోళన సృష్టించే విధంగా ఉన్నప్పటికీ దీని వలన బంధంలో ఎలాటి చీలికలు రావని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది మీ పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.  సరిగ్గా నిద్ర లేకపోవడం, కొన్ని సార్లు సంబంధాల అసంతృప్తికి కారణం అవుతుంది, అధిక ఒత్తిడి బంధాల్లో సమస్యలను సృష్టిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరికీ విశ్రాంతి అనేది అవసరం, ముఖ్యంగా ఒత్తిళ్లు , జీవన శైలి, వర్క్ ఇవన్నీ కూడా నిద్ర పై ప్రభావం చూపుతాయి కాట్టి, స్లీప్ డివోర్స్ అనేది, ఆరోగ్యం, శ్రేయస్సు, మానసిక ప్రశాంతతను అందిస్తుందంట. వీటి కోసం విడి విడిగా నిద్రిస్తారు, ఇది ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందంట.

4 / 5
ఆరోగ్యకరమైన జీవనశైలిలో నిద్ర అనేది కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర ఆరోగ్యం పై అవగాహన పెరిగే కొద్ది చాలా మంది స్లీప్ డివోర్స్ పై ఆసక్తి చూపుతున్నారు. దీని వలన దాదాపు మూడింటి ఒక వంతు జంటలు విడి విడిగా నిద్రించడానికి ప్రయత్నిస్తున్నారని తేలింది. అయితే కొందరు ఇది బంధంలో చీలికలకు కారణం అవుతుందని భయపడుతుంటారు, కానీ అలాంటి పరిస్థితి‌కి కారణం కాదు, ఆరోగ్యకరమైన జీవన శైలిలో మాత్రమే ఇది కీలకంగా ఉంటుందంట.

5 / 5
Follow Us