AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త మరణంతో డీలా పడలేదు.. ధైర్యంగా ముందడుగు వేసింది.. ఇప్పుడు ఆమె

భర్త చనిపోతే.. వారి కుటుంబ బాధ్యతలు తన కెందుకు అనుకొని పిల్లలను, కుటుంబాన్ని వదిలేసి వెళ్లేపోయే భార్యలు ఉన్న ఈ రోజుల్లో.. ఓ మహిళ మాత్రం భర్త కుటుంబానికి అండగా నిలుస్తూ భర్త బాధ్యతను మొత్తం తన భూజాలపై వేసుకొని మోస్తంది. కష్టపడి భర్త నడుపుతున్న వ్యాపారాన్ని ఇప్పుడు తానే ముందుకు తీసుకెళ్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

భర్త మరణంతో డీలా పడలేదు.. ధైర్యంగా ముందడుగు వేసింది.. ఇప్పుడు ఆమె
Maharashtra Inspiring Woman
Anand T
|

Updated on: Mar 10, 2026 | 1:36 PM

Share

మహారాష్ట్రలోని కరాడ్ తాలూకా ఆనేకు చెందిన కాళిదాస్ దేశాయ్ అనే యువకుడికి కొన్నాళ్ల క్రితం సోనాలి అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త కాళిదాస్ కరాడ్-ధేబెవాడి రాష్ట్ర రహదారిపై పంక్చర్ దుఖానాన్ని నడిపిస్తూ ఇంటిని నడిపేవాడు. అయితే ఏడాది క్రితం పంక్చర్‌ చేస్తుండగా ఒక్కసారిగా టైర్ పేలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాళిదాస్ చకిత్స పొందుతూ మరణించాడు. ఇక షాప్‌ను నడిపేవారు ఎవరూ లేకపోవడంతో అతని పంక్చర్ షాప్ ఆరు నెలల పాటు మూత బడింది. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి.

కొన్ని సందర్భంగాల్లో ఇంట్లో తినడానికి బియ్యం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక జీవనోపాధికి వేరే మార్గం లేకపోవడంతో, అతని భార్య సోనాలి దేశాయ్ తన భర్త దుకాణాన్ని తానే నడపాలని నిర్ణయించుకుంది. ఆమె భర్త బ్రతికి ఉన్నప్పుడు పంక్చర్ ఎలా వేయాలో అని కొన్ని విషయాలు ఆమె కూడా నేర్చుకుంది. దీంతో ఆమె భర్త పంక్ఛర్ దుకాణాన్ని తెరిచి నడపడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల్లోనే, పెద్ద కార్ల, లారీలు, ట్రాక్టర్లకు సైతం ఆమె పంక్చర్లు వేయడం నేర్చుకుంది. ఒక మగమనిషికి దీటుగా ఆమె అన్ని పనులు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు స్థానికంగా ఉన్న దుకాణాలకు పోటీగా ఆమె తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

అయితే తాను 10వ తరగతి వరకు చదువుకున్నాని, తన భర్త చనిపోవడంతో ఆయన స్నేహితులు, అన్నదమ్ములు, అత్తమామలు ఈ పనిలో తనకు సహాయం చేశారని ఆమె చెప్పుకొచ్చింది. తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, అలాగే అత్తగారు సహా నలుగురు ఉన్నారని.. కేవలం ఈ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయంతోనే తన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఆమె తెలిపింది. సామాజిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు లేదా ప్రభుత్వం నుండి ఏదైనా ఆర్థిక సహాయం అందితే తన వ్యాపారాన్ని విస్తరించాలనేదే తన ఉద్దేశమని ఆమె చెప్పుకొచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బొటనవేలికి ఉంగరం ధరిస్తే నిజంగానే మంచిది కాదా? జ్యోతిష్యం ప్రకారం
బొటనవేలికి ఉంగరం ధరిస్తే నిజంగానే మంచిది కాదా? జ్యోతిష్యం ప్రకారం
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..