AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్ స్టోరీ!

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ క్రేజీవాల్ రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకంగా మారిన మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు స్టోరీ మరోసారి తెరపైకి వచ్చింది. రీసెంట్‌గా ఆయన ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో కేజ్రీవాల్‌ ఈ కారు గురించి చెప్పడంతో.. దీని గురించి నెట్టింట మరోసాని చర్చ మొదలైంది. ఇంతకూ కేజ్రీవాల్‌కు ఈ కారుకు ఉన్న లింకేంటి? తెలుసుకుందాం పదండి.

Viral News: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్ స్టోరీ!
Arvind Kejriwal Blue Wagon R Story
Anand T
|

Updated on: Aug 12, 2026 | 9:58 AM

Share

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదే ఆయన రాజకీయ ప్రయాణంలో అత్యంత ప్రజాదరణ పొందిన తన బ్లూ కలర్.. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్ సార్థక్ గోస్వామి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కేజ్రీవాల్, ఆ కారుకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకోవడంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.

కేజ్రీవాల్‌కు ఈ కారుకు ఉన్న సంబంధం ఏంటి?

సాధారణంగా పొలిటీషన్స్ అనగానే మనకు వైట్ అండ్ వైట్.. భారీ లగ్జరీ ఎస్‌యూవీ కార్లు గుర్తొస్తాయి. కానీ అరవింద్ కేజ్రీవాల్‌ మాత్రం.. వీటిని పూర్తిగా భిన్నంగా ఉంటారు. ఆయన ఎప్పుడూ సాదాసీదా దుస్తువులతో పాటు చాలా నీడాంబరంగా నార్మల్ సమాన్యుడు వాడే వ్యాగన్ ఆర్ కారును వాడేవారు. అదే ఆయన రాజకీయ జీవితంలో కీలకమైంది. ప్రజల దృష్టిని ఆకర్షించింది. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది.

అయితే ఆ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ ఈ బ్లూ కలర్ వ్యాగనార్ కారులోనే ప్రచారం చేసి.. గతంలో 3సార్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌పై 22,000 పైగా ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. దీంతో కేజ్రీవాల్‌తో పాటు ఆయన ప్రచారంలో వాడిన కారుకు యమ క్రేజ్ వచ్చింది. అప్పట్లో ఈ కారు గురించి సోషల్‌ మీడియాలో తెగ చర్చ కూడా జరిగింది.

మరోసారి ట్రెండింగ్‌లోకి వ్యాగనార్

అయితే తాజాగా అరవింద్ కేజ్రీవాల్‌తో సార్థక్ గోస్వామి చేసిన పాడ్‌కాస్ట్ సందర్భంగా ఈ కారు గురించి చర్చ రావడంతో ఇది మరోసారి తెరపైకి వచ్చింది. ఈ పాడ్‌కాస్ట్‌లో సార్థక్ మీ వ్యాగనార్ కారు ఏమైందని ప్రశ్నించగా.. దానిపై కేజ్రీవాల్ సరదాగా స్పందించారు. మా ఫస్ట్ ఎన్నికల తర్వాత కూడా మేము ఆ కారునే ఉపయోగించామని ఆయన చెప్పారు. అయితే కాలక్రమేణా అది పాతబడి, వాడకానికి పనికిరాకుండా పోయివడంతో.. 2015లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను అధికారిక వాహనాన్ని వాడడం స్టార్ట్ చేశానని.. ఆ తర్వాత ఆ వ్యాగన్ ఆర్ కారును పార్టీకి చెందిన నాయకులు అధికారిక పనుల కోసం వాడారఅని తెలిపారు.

కేజ్రీవాల్ ఏం చెప్పారో ఇక్కడ చూడండి..

ఆ వ్యాగన్ ఆర్ ప్రత్యేకతలు ఇవే

  • అప్పట్లో కేజ్రీవాల్ వాడిన ఆ వ్యాగనార్ కారు 2005 మోడల్‌కు చెందినది. అప్పట్లో ఓ ఆప్‌ సపోర్టర్ అయిన ఓ వ్యక్తి ఈ మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారును పార్టీకి విరాళంగా ఇచ్చారట.
  • ఇంజిన్: 1.1-లీటర్ F10D 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్
  • పవర్ అండ్ టార్క్: 64 bhp పవర్, 84 Nm టార్క్
  • మైలేజ్: నగర వాతావరణంలో లీటరుకు 12 నుండి 15 కి.మీ

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us