AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయని క్లిక్ చేస్తే కొంపకొల్లేరే.. సైబర్ సెక్యూరిటీ పోలీసుల హైఅలర్ట్..

బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ షాపింగ్ సేల్స్ సందడి మొదలైందంటే చాలు.. భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, ఫిషింగ్ లింకులు, ఫేక్ క్యూఆర్ కోడ్లతో ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను అప్రమత్తం చేస్తూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక హెచ్చరికలు జారీ చేసింది.

బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయని క్లిక్ చేస్తే కొంపకొల్లేరే.. సైబర్ సెక్యూరిటీ పోలీసుల హైఅలర్ట్..
Black Friday Sale Scams Alert
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Nov 23, 2026 | 5:54 PM

Share

బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ షాపింగ్ సేల్స్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలను అప్రమత్తం చేసింది. భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ ప్రకటనలు, ఫిషింగ్ లింకుల ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారని హెచ్చరించింది. ప్రముఖ ఉత్పత్తులపై నమ్మశక్యం కాని ధరలకు ఆఫర్లు ప్రకటిస్తూ సైబర్ నేరగాళ్లు నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా వేదికల ద్వారా అనుమానాస్పద లింకులను పంపించి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈ లింకులపై క్లిక్ చేసి కొనుగోళ్లు జరిపే సమయంలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని TGCSB వెల్లడించింది. అంతేకాకుండా నకిలీ పేమెంట్ లింకులు, క్యూఆర్ కోడ్లను పంపించి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి అనధికారికంగా డబ్బులు బదిలీ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హెచ్చరించింది.

అధికారుల కీలక సూచనలు

  • పేరున్న వెబ్‌సైట్లు, అధికారిక షాపింగ్ యాప్‌ల ద్వారానే వస్తువులను కొనుగోలు చేయాలి.
  • ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు వెబ్‌సైట్ చిరునామాను జాగ్రత్తగా పరిశీలించాలి.
  • అతిగా కనిపించే డిస్కౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
  • ఓటీపీ, యూపీఐ పిన్, సీవీవీ వంటి వివరాలను ఎవరికీ చెప్పకూడదు.
  • అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండాలి
  • అనుమానాస్పద క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయకూడదు.
  • సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి

ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, అత్యవసర ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని TGCSB స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని సూచించింది. అలాగే అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజ్ఞప్తి చేసింది.

Follow Us
నాతో కలిసి నటించిన హీరోయిన్.. ఇప్పుడు ఎంపీ అయ్యింది..
నాతో కలిసి నటించిన హీరోయిన్.. ఇప్పుడు ఎంపీ అయ్యింది..
బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయని క్లిక్ చేస్తే కొంపకొల్లేరే..
బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయని క్లిక్ చేస్తే కొంపకొల్లేరే..
అమెరికా తొలి అధ్యక్షుడి వెంట్రుకలకు లక్షల్లో ధర.. వేలంలో రికార్డ్
అమెరికా తొలి అధ్యక్షుడి వెంట్రుకలకు లక్షల్లో ధర.. వేలంలో రికార్డ్
రైలులో బాలికల అక్రమ రవాణా యత్నం.. నిందితుడి అరెస్ట్
రైలులో బాలికల అక్రమ రవాణా యత్నం.. నిందితుడి అరెస్ట్
సెమీస్‌ బెర్త్‌ కోసం భారత్‌ పోరు.. యూఏఈతో చావోరేవో మ్యాచ్‌
సెమీస్‌ బెర్త్‌ కోసం భారత్‌ పోరు.. యూఏఈతో చావోరేవో మ్యాచ్‌
ఆయన లేకపోతే నేను స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని కాదు..
ఆయన లేకపోతే నేను స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని కాదు..
ప్రకృతి ఒడిలో పెళ్లి పందిరి.. రసాయనాల్లేని విందు భోజనం..
ప్రకృతి ఒడిలో పెళ్లి పందిరి.. రసాయనాల్లేని విందు భోజనం..
రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు కన్ఫర్మ్ టికెట్ పొందడం ఎలా
రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు కన్ఫర్మ్ టికెట్ పొందడం ఎలా
చికెన్, పెరుగు కలిపి తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
చికెన్, పెరుగు కలిపి తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
బుమ్రాను సరిగ్గా వాడుకోలేదా? గిల్‌ వ్యూహాలపై తీవ్ర చర్చ
బుమ్రాను సరిగ్గా వాడుకోలేదా? గిల్‌ వ్యూహాలపై తీవ్ర చర్చ