AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెటా కంటెంట్ పాలసీలపై కేంద్రం కీలక సూచనలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’ తప్పనిసరి!

Centre Asks Meta for Human Review of Deepfakes: భారత చట్టాలు, సాంస్కృతిక సందర్భానికి అనుగుణంగా కంటెంట్ పాలసీలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం మెటాను కోరింది. డీప్‌ఫేక్‌లను గుర్తించి తొలగించడంలో ఆటోమేషన్‌తో పాటు మానవ సమీక్ష తప్పనిసరి చేయాలని సూచించింది.

మెటా కంటెంట్ పాలసీలపై కేంద్రం కీలక సూచనలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’ తప్పనిసరి!
Centre Asks Meta For Human Review Of Deepfakes
Rajashekher G
|

Updated on: Aug 12, 2026 | 10:10 AM

Share

న్యూఢిల్లీ: భారత చట్టాలు, దేశ సాంస్కృతిక సందర్భానికి అనుగుణంగా తమ కంటెంట్ పాలసీలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం Metaకు సూచించినట్లు సమాచారం. అయితే, మెటా ప్లాట్‌ఫామ్‌ల అల్గారిథమ్‌లను పూర్తిగా మార్చాలని ప్రభుత్వం కోరలేదని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ NDTV Profit నివేదించింది. మెటాతో ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయి. హానికరమైన కంటెంట్‌ను అడ్డుకోవడం, భారతీయ నిబంధనలను పాటించడం, కంటెంట్‌ను ఎలా గుర్తిస్తున్నారు, ఎలా మోడరేట్ చేస్తున్నారు, వినియోగదారులకు ఎలా సిఫార్సు చేస్తున్నారు అనే అంశాలపై మరింత స్పష్టత తీసుకురావడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

డీప్‌ఫేక్‌లపై ప్రత్యేక దృష్టి

సోషల్ మీడియాలో పెరుగుతున్న డీప్‌ఫేక్ కంటెంట్‌పై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అనుమానాస్పద డీప్‌ఫేక్‌లను గుర్తించి తొలగించే విషయంలో కేవలం ఆటోమేటెడ్ సిస్టమ్‌లపై ఆధారపడకుండా, ‘హ్యూమన్-ఇన్-ది-లూప్’ విధానాన్ని అమలు చేయాలని మెటాను కోరినట్లు సమాచారం. అంటే, అనుమానాస్పద కంటెంట్‌పై తుది చర్య తీసుకునే ముందు మానవ నిపుణుల ద్వారా సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.

అదేవిధంగా, ప్రముఖ వెరిఫైడ్ ఖాతాల నుంచి వచ్చే కంటెంట్‌ను కేవలం కొన్ని సాంకేతిక ప్రమాణాల ఆధారంగా డీప్‌ఫేక్‌గా వర్గీకరించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాంటి సందర్భాల్లోనూ తగిన మానవ సమీక్ష అనంతరం మాత్రమే చర్యలు తీసుకోవాలని సూచించింది.

తొలగించిన డీప్‌ఫేక్ మళ్లీ రాకుండా చర్యలు

ఒకసారి డీప్‌ఫేక్ కంటెంట్‌ను గుర్తించి ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించిన తర్వాత, అదే లేదా సంబంధిత కంటెంట్ మళ్లీ కనిపించకుండా ప్రత్యేకమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మెటాను కోరింది.

CSAMపై జీరో టాలరెన్స్

చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM) విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇలాంటి కంటెంట్‌పై తక్షణం, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అధికార వర్గాలు మెటా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

అల్గారిథమ్‌లపై మరింత పారదర్శకత

ఇదిలా ఉండగా, మెటా అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తున్నాయి? ఏ ప్రాతిపదికన ఒక కంటెంట్‌ను వినియోగదారులకు సిఫార్సు చేస్తున్నాయి? అనే అంశాలపై కూడా ప్రభుత్వం మరింత స్పష్టత కోరుతోంది. కంటెంట్ మోడరేషన్, డీప్‌ఫేక్‌లు, అల్గారిథమిక్ సిఫార్సులు, భారతీయ చట్టాల అమలు వంటి అంశాలపై సోషల్ మీడియా సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతీయ చట్టపరమైన వ్యవస్థకు అనుగుణంగా మెటా కంటెంట్ పాలసీలు, అమలు విధానాలు పనిచేసేలా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

Follow Us