AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: రాజస్థాన్ తన్ని తరిమేసింది.. కట్‌చేస్తే.. 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో బీభత్సం..

Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆదివారం జరిగిన గ్రూప్ డి మ్యాచ్‌లో ఢిల్లీ 10 పరుగుల తేడాతో సౌరాష్ట్రను ఓడించింది. కెప్టెన్ నితీష్ రాణా డేంజరస్ హాఫ్ సెంచరీతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2026: రాజస్థాన్ తన్ని తరిమేసింది.. కట్‌చేస్తే.. 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో బీభత్సం..
Nitish Rana
Venkata Chari
|

Updated on: Dec 01, 2025 | 1:25 PM

Share

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆదివారం జరిగిన గ్రూప్ డి మ్యాచ్‌లో ఢిల్లీ 10 పరుగుల తేడాతో సౌరాష్ట్రను ఓడించింది. కెప్టెన్ నితీష్ రాణా విస్ఫోటక అర్ధ సెంచరీ ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి సౌరాష్ట్ర బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. సౌరాష్ట్ర జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ విజయంలో ఢిల్లీ కెప్టెన్ నితీష్ రాణా కీలక పాత్ర పోషించారు.

నితీష్ రాణా మెరుపులు..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టుకు కెప్టెన్ నితీష్ రాణా అద్భుతమైన స్కోరును అందించారు. కేవలం 41 బంతుల్లోనే 7 సిక్సర్లు, 3 ఫోర్లతో 76 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ఇతర బ్యాటర్ల సహకారం..

నితీష్ రాణాతో పాటు యష్ ధుల్ (30 బంతుల్లో 47), ఆయుష్ బదోని (25 బంతుల్లో 33) రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇవి కూడా చదవండి

సౌరాష్ట్ర పోరాటం..

208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ప్రేరక్ మన్కడ్ (28 బంతుల్లో 50) అర్ధశతకంతో పోరాడినప్పటికీ, మిగతా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయలేకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌరాష్ట్ర తరఫున, ప్రేరక్ మన్కడ్ 28 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. దీనితో పాటు, హార్విక్ దేశాయ్ 19 బంతుల్లో 32 పరుగులు, పార్శ్వరాజ్ రాణా 23 బంతుల్లో 24 పరుగులు, రుచిర్ అహిర్ 21 బంతుల్లో 39 పరుగులు, లక్కీ రాజ్ వాఘేలా 7 బంతుల్లో 23 పరుగులు చేశారు.

సుయేష్ శర్మ మ్యాజిక్..

బౌలింగ్‌లో ఢిల్లీ బౌలర్ సుయేష్ శర్మ అద్భుతంగా రాణించారు. 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచారు.

నితీష్ రాణా గత సీజన్‌లో ఉత్తర ప్రదేశ్ తరపున ఆడినా, ఈ సీజన్‌లో తిరిగి ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి సత్తా చాటుతుండటం విశేషం. ఈ విజయంతో ఢిల్లీ నాకౌట్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..