AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని ఘోరం..

కన్నతల్లి పెట్టిన గోరుముద్దలు ఇంకా గొంతు దాటనే లేదు.. అమ్మ ఒడిలో చేసిన గారాలు ఇంకా తీరనే లేదు.. ఇంతలోనే ఆ పసికందు పాలిట మృత్యువు పామై వచ్చింది. ఆడుకుందామని ఆరుబయటకు వెళ్లిన ఆ మూడేళ్ల చిన్నారిని పాము కాటేయడంతో ఆ ఇంటి దీపం ఆరిపోయింది.

Andhra Pradesh: ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని ఘోరం..
3 Year Old Girl Dies Of Snake Bite
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 10:03 PM

Share

కన్న తల్లిదండ్రులు పిల్లలకోసం ఎన్నో కలలు కంటారు. వారి భవిష్యత్ కోసం పిల్లలు పుట్టినప్పటినుంచి అనేక రకాలుగా ఆలోచనలు చేస్తారు. కానీ వారి కలలు చెట్ల ఆకుల్లా ఒక్కసారిగా రాలిపోతే ఆ భాద భరించటం ఎవరివల్లా కాదు. అప్పటివరకు అమ్మ ఒడిలో గారాలు పోయిన మూడేళ్ల పసికందు ఇంటిముందు ఆడుకునేందుకు వచ్చింది. అదేసమయంలో అక్కడే ఉన్న త్రచూపాము బాలికను కాటేసింది. తల్లి బిడ్డ కనిపించకపోవడంతో ఇంట్లోనుంచి వచ్చేలోగానే ఈ ఘోరం జరిగిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన తీగల ప్రకాష్ , ధనలక్ష్మి వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు కూతుళ్లు. మొదటి బిడ్డకు ఆరేళ్లు, రెండో కూతురుకు 3 ఏళ్ల వయస్సు ఉంటుంది. అప్పటివరకు తల్లి ఒడిలో ఆడుకుని గోరుముద్దలు తిన్న చిన్నారి హన్సిక ఆటవిడుపుగా ఆరు బయటకు వెళ్లి ఆడుకుంటూ, అచేతనంగా పడిపోయింది. చుట్టూ పరిసరాలు చూసేసరికి ఆరు బయట గడ్డి మధ్య త్రాచుపాము పాము కనపడింది. భయంతో ఆమె వేసిన అరుపులకు చుట్టుపక్కల ఉన్న స్థానికులు చేరుకుని గడ్డి మధ్యలో పడగవిప్పి బుసలు కొడుతున్న పాముని కర్రలతో కొట్టి చంపారు. వెంటనే పాపను నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స చేసినా బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే విష ప్రభావంతో బాలిక మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

Follow Us
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్
ఆధార్ కార్డులపై కేంద్రం మరో శుభవార్త.. త్వరలో ఈ సేవలు కూడా..
ఆధార్ కార్డులపై కేంద్రం మరో శుభవార్త.. త్వరలో ఈ సేవలు కూడా..
తరచూ మూత్ర విసర్జన, మంటగా ఉందా? యూరిన్ ఇన్ఫెక్షన్ సంకేతాలే..!
తరచూ మూత్ర విసర్జన, మంటగా ఉందా? యూరిన్ ఇన్ఫెక్షన్ సంకేతాలే..!
2027 నాటికి భారత్ ఆర్థిక వృద్ధి అంచనా ఎంతో తెలుసా?
2027 నాటికి భారత్ ఆర్థిక వృద్ధి అంచనా ఎంతో తెలుసా?
ఉపాధ్యాయుల‌ ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!
ఉపాధ్యాయుల‌ ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!
సెమీస్ ఆశలు నిలవాలంటే.. ఎంత తేడాతో టీమిండియా గెలవాలో తెలుసా?
సెమీస్ ఆశలు నిలవాలంటే.. ఎంత తేడాతో టీమిండియా గెలవాలో తెలుసా?
రోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో..
రోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో..
NCERT వివాదంపై ప్రధాని మోదీ సీరియస్.. విద్యాశాఖకు కీలక ఆదేశాలు
NCERT వివాదంపై ప్రధాని మోదీ సీరియస్.. విద్యాశాఖకు కీలక ఆదేశాలు