AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇది కదా కావాల్సింది.. తెలంగాణ విద్యార్థులకు భలే గుడ్ న్యూస్..

తెలంగాణ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ .. ఒకే కిట్‌లో విద్యార్థుల అన్ని అవసరాలు! చదువు నుంచి హాస్టల్ వినియోగం వరకు 24 రకాల వస్తువులను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం… లక్షలాది మందికి లాభం. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం ...

Telangana: ఇది కదా కావాల్సింది.. తెలంగాణ విద్యార్థులకు భలే గుడ్ న్యూస్..
Students
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Apr 06, 2026 | 1:31 PM

Share

విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న చిన్నారుల నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు.. వారి రోజువారీ అవసరాలన్నింటినీ ఒకే చోట అందించేలా ప్రత్యేక “ఎడ్యుకేషన్ కిట్”లను ప్రవేశపెట్టింది.

ఈ పథకం ద్వారా దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. చదువుకు అవసరమైన స్టేషనరీతో పాటు, హాస్టల్ జీవనానికి అవసరమైన పరికరాలు కూడా ఇందులో భాగం కావడం ఈ కిట్ ప్రత్యేకత. విద్యార్థుల వయస్సు, తరగతి ఆధారంగా బ్యాగ్‌లను డిజైన్ చేశారు. చిన్నపిల్లలకు తేలికపాటి బ్యాగ్‌లు, పెద్ద తరగతుల విద్యార్థులకు ఎక్కువ సామర్థ్యం గల బ్యాగ్‌లు అందించనున్నారు. అంతేకాదు, పెన్నులు, పెన్సిల్స్, స్కెచ్‌లు, పౌచ్‌లు వంటి స్టేషనరీ వస్తువులు పూర్తి సెట్‌గా ఇవ్వనున్నారు.

ఇదే కాకుండా, హాస్టల్ విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్లేట్, గ్లాస్, స్పూన్ వంటి భోజన పరికరాలు, అలాగే దుప్పట్లు కూడా అందించనున్నారు. ప్రతి వస్తువుపై ప్రభుత్వ గుర్తింపు ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. విద్యార్థుల గుర్తింపును సులభతరం చేసేందుకు ఐడీ కార్డులను తప్పనిసరి చేస్తున్నారు. అలాగే ఉన్నత తరగతుల్లో చదివే విద్యార్థినుల యూనిఫామ్‌లో మార్పులు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కిట్‌ల సరఫరా కోసం టెండర్ ప్రక్రియను కఠినంగా అమలు చేస్తున్నారు. ఎంపికైన కాంట్రాక్టర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఎలాంటి లోపాలు చోటుచేసుకున్నా డిపాజిట్ జప్తు చేసే విధంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. సరఫరాలో పారదర్శకత కోసం ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా, ఒకే కిట్‌తో విద్యార్థుల అన్ని అవసరాలను తీర్చే ఈ పథకం… విద్యా రంగంలో ప్రభుత్వ కొత్త ఆలోచనగా నిలుస్తోంది.

Also Read: కొత్తిమీర ఇంటి వద్ద కట్టలు కట్టలుగా రావాలంటే ఇలా చేయండి.. 

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు