అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రకృతి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఓ ఇంటి వద్ద ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించే అరుదైన మే పుష్పాలు ఈసారి కూడా తమ అందాలను విరబూసి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మే నెల రాగానే ప్రకృతి ప్రేమికులకు పండుగలా మారిన ఈ పూలు రంగురంగుల చీర కట్టుకున్నట్లుగా పరిసరాలను అలంకరిస్తున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రకృతి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఓ ఇంటి వద్ద ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించే అరుదైన మే పుష్పాలు ఈసారి కూడా తమ అందాలను విరబూసి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మే నెల రాగానే ప్రకృతి ప్రేమికులకు పండుగలా మారిన ఈ పూలు రంగురంగుల చీర కట్టుకున్నట్లుగా పరిసరాలను అలంకరిస్తున్నాయి. తెల్లటి, గులాబీ, పసుపు రంగుల్లో విరబూసిన ఈ పుష్పాలు చూసేందుకు స్థానికులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివస్తున్నారు. ఈ పుష్పాలు సంవత్సరంలో ఒక్కసారే వికసించడం ప్రత్యేకత. కొన్ని రోజులపాటు మాత్రమే కనిపించే ఈ అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు ప్రకృతి ప్రియులు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ప్రకృతి ఇచ్చిన ఈ అందమైన కానుకను కాపాడుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి అరుదైన పుష్పాలు మన ప్రాంతంలో ఉండటం గర్వకారణమని వారు చెబుతున్నారు.
