AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్‌ టాపర్ గా సక్సెస్

నాడు “మీసాల పిల్ల” అంటూ ఎగతాళి.. నేడు స్టేట్‌ టాపర్ గా సక్సెస్

Phani CH
|

Updated on: May 01, 2026 | 5:11 PM

Share

ముఖంపై రోమాల కారణంగా ట్రోలింగ్‌కు గురైన యూపీ బోర్డు టాపర్ ప్రాచీ నిగమ్, 10వ తరగతిలో రికార్డు సృష్టించిన తర్వాత, తాజాగా 12వ తరగతి ఫలితాల్లో 91.20% మార్కులతో మళ్లీ విజయం సాధించింది. ఆమె తన ప్రతిభతో విమర్శలకు సమాధానం చెప్పి, యువతకు ఆదర్శంగా నిలిచింది. అవమానాలను విజయ సోపానాలుగా మలచుకున్న ఆమె ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం.

నాడు ముఖంపై రోమాలు ఉన్నాయంటూ ట్రోలింగ్‌కు గురైన ఉత్తరప్రదేశ్‌ టాపర్ ప్రాచీ నిగమ్ మరోసారి సంచలనం సృష్టించింది. 10వ తరగతిలో యూపీ బోర్డు టాపర్‌గా నిలిచిన ఆమె, తాజాగా వెలువడిన 12వ తరగతి ఫలితాల్లోనూ 91.20 శాతం మార్కులతో విజయాన్ని నమోదు చేసి ఆదర్శంగా నిలిచింది. లోకం ఎప్పుడూ పైరూపాన్నే చూస్తుంది, ప్రతిభ లోతును చూడదు. మనిషి ముఖంపై ఉండే వెంట్రుకలను చూసి వెక్కిరించే సమాజానికి, తన మెదడులోని మేధస్సుతో సమాధానం చెప్పింది ప్రాచీ నిగమ్. అవమానాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, వాటినే ఏరుకుని విజయానికి మెట్లుగా మార్చుకున్న ఆ విద్యార్థిని ప్రయాణం నేటి తరానికి ఒక గొప్ప పాఠం. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందిన ప్రాచీ నిగమ్, 2024 యూపీ బోర్డు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర టాపర్‌గా నిలిచినప్పుడు దేశమంతా ఆమె వైపు చూసింది. అయితే, ఆ సమయంలో ఆమె సాధించిన మార్కుల కంటే, ఆమె ముఖంపై ఉన్న హార్మోన్ల మార్పుల వల్ల వచ్చిన ‘మీసాల’పై సోషల్ మీడియాలో కొందరు దారుణమైన ట్రోలింగ్ చేశారు. “మీసాల పిల్ల” అంటూ ఎగతాళి చేశారు. కానీ, ప్రాచీ ఆ మాటలకు చలించలేదు. కన్నీళ్లకు బదులు తన కలానికి పదును పెట్టింది. తాజాగా విడుదలైన 12వ తరగతి ఫలితాల్లో ప్రాచీ 91.20 శాతం మార్కులు సాధించి తన ప్రతిభ యాదృచ్ఛికం కాదని నిరూపించింది. వరుసగా రెండుసార్లు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ద్వారా, తనపై వచ్చిన విమర్శలన్నింటికీ ఆమె మౌనంగానే చెక్ పెట్టింది. రూపం అనేది ప్రకృతి ఇచ్చేది, కానీ ప్రతిభ అనేది మనం సాధించుకునేది. ప్రాచీ తన రూపాన్ని చూసి సిగ్గుపడకుండా, తన లక్ష్యంపైనే దృష్టి పెట్టింది. ఒకసారి టాపర్‌గా నిలవడం అదృష్టం కావచ్చు, కానీ రెండోసారి కూడా అదే స్థాయి మార్కులు సాధించడం ఆమె పట్టుదలకు నిదర్శనం. సమాజం చేసే వెక్కిరింతలు మనల్ని ఆపలేవని, మన విజయం ముందు ఏ విమర్శ నిలవదని ఆమె నిరూపించింది. భవిష్యత్తులో దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థ అయిన ఐఐటీలో చదివి, గొప్ప ఇంజనీర్ కావాలన్న దృఢ సంకల్పంతో ప్రాచీ ముందుకెళ్తోంది. దేవుడు తనకు ఇచ్చిన రూపంతో తను సంతోషంగానే ఉన్నాననీ చరిత్రలో చాణక్యుడిని కూడా అతని రూపం చూసి జనం హేళన చేసారనీ కానీ అతను పట్టించుకోలేదనీ తెలిపింది. తను కూడా తన చదువుపైనే దృష్టి పెడతానని ప్రాచీ స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్‌ ఏం చేసాడంటే

రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్‌

వంట గ్యాస్‌ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ

Follow Us