AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh : ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి.. ప్రతి క్షణం గుర్తొచ్చేవి.. అడివి శేష్ ఎమోషనల్ కామెంట్స్..

టాలీవుడ్ హీరో ఆదివి శేష్ విభిన్న కంటెంట్ కథలతో తనదైన ముద్ర వేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గతంలోని లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి పలు విషయాలు పంచుకున్నారు. అమెరికాలో ఉండగా ఏర్పడిన రెండు సంబంధాలలో ఒక ప్రియురాలు మరణించగా, మరొకరి వివాహం తన పుట్టినరోజు నాడే జరగడం తనను తీవ్రంగా కలిచివేసింది. ఈ తీపి-చేదు జ్ఞాపకాలే తనలోని సృష్టిని ప్రభావితం చేశాయని ఆయన వెల్లడించారు.

Adivi Sesh : ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి.. ప్రతి క్షణం గుర్తొచ్చేవి.. అడివి శేష్ ఎమోషనల్ కామెంట్స్..
Adivi Sesh
Rajitha Chanti
|

Updated on: May 01, 2026 | 6:02 PM

Share

టాలీవుడ్ హీరో ఆడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విభిన్నమైన కథలతో తనదైన ముద్ర వేశారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత సున్నితమైన, భావోద్వేగ విషయాలను వెల్లడించారు. తాను సినిమా గురించి కాకుండా, తన వ్యక్తిగత జీవితంలోని లవ్ ఫెయిల్యూర్ అనుభవాల గురించి మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రేమలో విఫలమైన ప్రతి ఒక్కరికీ కొన్ని ఫాంటసీలు ఉంటాయని, ఉదాహరణకు మాజీ ప్రేయసి అనుకోకుండా ఎదురుపడటం, లేదా ఆమె ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడం వంటి ఊహలు వస్తాయని తెలిపారు. తన సినిమాల్లో తరచుగా ప్రేమ విఫల అంశాలు ఎందుకుంటాయని ప్రశ్నించగా, అది కేవలం బ్రేకప్ తర్వాత కూడా ఆ ప్రేయసి గురించి ఆలోచించడం, సహాయం చేయడం అనే ఒక “బ్యూటీ” అని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..

తాను కూడా ఆ “తీపి-చేదు బాధ”ను అనుభవించానని ఆదివి శేష్ తెలిపారు. సుమారు 20 సంవత్సరాలు అమెరికాలో నివసించిన తాను, అక్కడ రెండు సంబంధాలను కలిగి ఉన్నానని వెల్లడించారు. ఈ రెండు సంబంధాలలో ఒకటి కొన్ని కారణాల వల్ల విడిపోగా, రెండో అమ్మాయి దురదృష్టవశాత్తు మరణించడం తనను మానసికంగా చాలా ప్రభావితం చేసిందని వివరించారు. ఈ విషాదాన్ని తాను అస్సలు జీర్ణించుకోలేకపోయానని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

అంతేకాకుండా, ప్రేమ విఫలమైన మొదటి ప్రియురాలి వివాహం తన పుట్టినరోజు నాడే జరగడం తనను మరింత కలచివేసిందని శేష్ తెలిపారు. సుమారు 10 నుండి 15 సంవత్సరాల తర్వాత, తన పుట్టినరోజున కాకుండా, ముహూర్తాలు మారడం వల్ల ఒక వారం తర్వాత పెళ్లి జరిగిందని తెలిసిందని, కానీ మొదటి పదేళ్లపాటు, ముఖ్యంగా తన టీనేజ్ సమయంలో, ప్రతి పుట్టినరోజు నాడు ఆ పెళ్లి సంఘటనే గుర్తుకు వచ్చేదని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు. ఈ జ్ఞాపకాలు తనను తీవ్రంగా వెంటాడాయని తెలిపారు. ఈ రకమైన బాధను, భావోద్వేగాలను తాను క్షణం, డెకాయిట్ వంటి తన చిత్రాలలో అన్వేషించడానికి ప్రయత్నించానని ఆదివి శేష్ స్పష్టం చేశారు. ఈ అనుభవాలే తనను ఈరోజు ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దాయని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‏తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..

Follow Us