AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

గ్లామర్ ఫీల్డ్‌లో టాలెంట్‌తో పాటు కాస్త 'లక్' కూడా తోడవ్వాలి. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకుని, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా కూడా సరైన సక్సెస్ లేక వెనకబడిపోయిన హీరోయిన్లు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు ఆమె కుర్రాళ్ల ఆరాధ్య దేవత. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది.

Actress : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
Charmy Kaur
Rajitha Chanti
|

Updated on: Apr 29, 2026 | 5:01 PM

Share

చార్మీ కౌర్.. ఈ పేరు వినగానే కుర్రకారుకు ఒకప్పుడు నిద్రలేకుండా చేసిన అందాల భామ గుర్తుకొస్తుంది. ‘నీతో’, ‘శ్రీ ఆంజనేయం’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తనదైన నటనతోనే కాకుండా, గ్లామర్‌తోనూ ప్రేక్షకులను కట్టిపడేసిన చార్మీ, తాజాగా లేటేస్ట్ ఫోటోతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. సాధారణంగా సెలబ్రిటీల చైల్డ్‌హుడ్ ఫోటోలు లేదా కెరీర్ ప్రారంభంలో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడం సహజం. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న చార్మీ ఫోటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అందులో ఆమె చాలా అమాయకంగా, ఇప్పటి రూపానికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. “ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?” అంటూ సాగుతున్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..

ఒకప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా తనదైన ముద్ర వేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఊహించని విధంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ లుక్స్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. అందులో అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

ప్రస్తుతం చార్మీ సినిమాల్లో నటించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన జిమ్ వర్కవుట్స్, వెకేషన్ ఫోటోలు, సినిమా అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. తాజాగా వైరల్ అవుతున్న ఆమె పాత ఫోటోను చూసి “అప్పుడు ఇప్పుడు కూడా చార్మీ ఎంతో క్యూట్‌గా ఉంది” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, టాలీవుడ్ తెరపై తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న ఈ ‘మంత్ర’ బ్యూటీ, నేటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

Follow Us