AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..

నటుడు జేడీ చక్రవర్తి తన విలక్షణమైన నటనతోనే కాకుండా, 56 ఏళ్లు దాటినా ఇప్పటికీ కుర్రాడిలా కనిపించే తన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన తన ఆరోగ్య రహస్యాలను (Health Secrets) బయటపెట్టారు. ఆయన చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..
Jd Chakravarthy
Rajitha Chanti
|

Updated on: Apr 25, 2026 | 6:09 PM

Share

తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జేడీ చక్రవర్తి. గులాబీ సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న చక్రవర్తి.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు. ఆ తర్వతా పలు చిత్రాల్లో సహయ నటుడిగా కనిపించారు. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న జేడీ చక్రవర్తి.. జోష్ సినిమాలో విలన్ పాత్రతో అదరగొట్టారు. ఇప్పుడు తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆయన.. బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన హెల్త్ సీక్రెట్స్ బయటపెట్టారు. తన కెరీర్లో కావాలని ఒక విరామం తీసుకున్నానని వెల్లడించారు. “నేను అంత బ్రేక్ తీసుకోకపోతే… చాలా లాంగ్ బ్రేక్,” అని ఆయన అన్నారు. సరైన ప్రాజెక్ట్ కోసం తాను వేచి ఉన్నానని, దయా వెబ్ సిరీస్ ఆ నమ్మకాన్ని ఇచ్చిందని తెలిపారు. “దయా విన్న వెంటనే నాకు అర్ధమైపోయింది. దిస్ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ అని,” అని ఆయన వివరించారు. దయా విజయవంతం అయిన తర్వాతే తాను గాయపడ్డ సింహం చేయాలని నిర్ణయించుకున్నానని, దానికి ముందు వచ్చిన అనేక ఆఫర్లను తిరస్కరించానని చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..

అలాగే తన 56 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా ఉండటానికి గల కారణాన్ని వివరించారు. తాను గత 24 నుండి 25 ఏళ్లుగా అన్నం (Rice) తినడం పూర్తిగా మానేశానని అన్నారు. సాధారణంగా ఒక రోజు అన్నం తినకపోతేనే నీరసించిపోతాం, కానీ ఆయన పాతికేళ్లుగా రైస్ ముట్టకుండా ఉండటం విశేషం. కేవలం ఫిట్‌నెస్ కోసమే కాకుండా, తనకు ఆహారం (Food) అంటే పెద్దగా ఇష్టం ఉండదని, అందుకే దానికి దూరంగా ఉంటున్నానని ఆయన తెలిపారు. పండ్లు, పండ్ల రసాల (Fruit Juices) పట్ల కూడా పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు. జ్యూస్‌లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందని వాటిని కూడా పరిమితంగానే తీసుకుంటానని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!

శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అందేలా జాగ్రత్త పడతాను తప్ప.. రుచి కోసం ఏది పడితే అది తినని అన్నారు. తన సోదరి లాంటి వారు మధ్యాహ్నం భోజనం చేస్తూ రాత్రి ఏం తినాలో ప్లాన్ చేస్తుంటే, తాను మాత్రం భోజనం చేయడం ఒక పనిలా భావిస్తానని సరదాగా చెప్పారు. ఆహార నియమాలతో పాటు, వ్యాయామం విషయంలో ఆయన ఏమాత్రం రాజీ పడనని తెలిపారు. ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు కఠినమైన వర్కవుట్స్ చేస్తానని… షూటింగ్ నిమిత్తం అవుట్‌డోర్ వెళ్లినా, విదేశాలకు వెళ్లినా సరే వ్యాయామాన్ని మాత్రం అస్సలు వదలనని తెలిపారు. ఆరోగ్యం అంటే కేవలం శరీరం మాత్రమే కాదని, పర్సనల్ లైఫ్‌లో సంతోషంగా ఉంటేనే ప్రొఫెషనల్ లైఫ్‌లో రాణించగలమని .. ఒత్తిడికి లోనుకాకుండా, తనకు నచ్చిన పనిని ఇష్టంగా చేయడం వల్లే ఇంత యంగ్‌గా కనిపిస్తున్నానని ఆయన వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Actress Raashi: ఆ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పిన రాశి.. తన పెళ్లికి వారం రోజుల ముందే మరణించిందంటూ ఎమోషనల్..

ఎక్కువమంది చదివినవి : Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..

Follow Us