AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..

తెలుగు సినీ పరిశ్రమలో తమ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ దాదాపు మూడు నాలుగు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో చక్రం తిప్పిన పాపులర్ నటుల గురించి మీకు తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటుడు హీరో శ్రీకాంత్ భార్య ఊహా మేనమామ. అవును.. అప్పట్లో వందలాది చిత్రాల్లో నటించి మెప్పించారు.

Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..
Srikanth, Ooha
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2026 | 8:18 PM

Share

తొంభైల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఊహ (Ooha). సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ‘ఆమె’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తొలి చిత్రంతోనే నంది అవార్డును గెలుచుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు ఊహ. అయితే, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆమె నటుడు శ్రీకాంత్‌ను వివాహం చేసుకుని వెండితెరకు దూరమవ్వడం అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ఊహ అసలు పేరు శివరంజని. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన ఆమె, శ్రీకాంత్‌తో కలిసి ‘ఆమె’, ‘కూతురు’, ‘ఆయనకి ఇద్దరు’ వంటి సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం రహస్యంగా సాగింది. పెళ్లి తర్వాత ఆమె నటనకు పూర్తిగా స్వస్తి పలికి కుటుంబ బాధ్యతలకే పరిమితమయ్యారు.

Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..

ప్రస్తుతం ఊహ, శ్రీకాంత్ దంపతులకు ముగ్గురు పిల్లలు (రోషన్, మేధ, రోహన్). వీరిలో పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే ‘నిర్మల కాన్వెంట్’, ‘పెళ్లి సందడి’ వంటి సినిమాలతో హీరోగా పరిచయమయ్యారు. ఇటీవల ఛాంపియన్ సినిమాతో హిట్టు అందుకున్నడాు. పిల్లల కెరీర్ ప్లానింగ్‌లో ఊహ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఊహను ఒక గొప్ప నటిగా, ఆదర్శవంతమైన భార్యగా గౌరవిస్తారు.

Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

ఇదిలా ఉంటే.. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఊహ మేనమామ తెలుగులో తోపు నటుడు. నాలుగు దశాబ్దాల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో చక్రం తిప్పిన నటుడు. ఆయన మరెవరో కాదు పీఎల్ నారాయణ. మలయాళీ కుటుంబానికి చెందిన ఆయన గుంటూరులో పుట్టి పెరిగారు. బాపట్లలో విద్యాభ్యాసం తర్వాత ఒంగోలు వెళ్లి నాటకాలు వేశారు. ఆయన నటించిన ‘కుక్క’ అనే నాటకానికి జాతీయ అవార్డు దక్కింది. దీంతో నెమ్మదిగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. లాయర్, బడిపంతులు, రాజకీయ నేత, కార్మిక నేత, బిక్షగాడు, తాగుబోతు.. వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం భాషలలో కలిపి దాదాపు 300 పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు.

Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..

Pl Narayana

Pl Narayana

Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

Follow Us