AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!

కుంభమేళా ఫోటోలతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన మోనాలిసా భోసలే జీవితంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తన వివాహం చుట్టూ చట్టపరమైన వివాదాలు నడుస్తున్న తరుణంలో, మోనాలిసా ప్రస్తుతం గర్భవతి అని ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ వెల్లడించినట్లు తెలుస్తోంది.. మధ్యప్రదేశ్ పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయగా, ఆమె ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రయాణం చేయలేదని ఆయన పేర్కొన్నారు.

Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!
Monalisa
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2026 | 7:02 PM

Share

కుంభమేళాలో మెరిసి, రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోస్లే (Monalisa Bhosle) పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. తన వివాహం, వయస్సు వివాదాలతో అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ‘వైరల్ గర్ల్’, ఇప్పుడు గర్భవతి అని ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ చేసిన ప్రకటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కుంభమేళాలో తన అందమైన కళ్లతో నెటిజన్ల మనసు గెలుచుకుంది. పూసలు అమ్ముకునే అమ్మాయిని ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ప్రైవేట్ సాంగ్స్ అంటూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది మోనాలిసా. కానీ ఆ తర్వాత తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాహంపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోనాలిసా మైనర్ అని, ఆమెను ప్రలోభపెట్టి పెళ్లి చేసుకున్నారని మధ్యప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు కేరళ నుండి మధ్యప్రదేశ్ వరకు పాకింది.

Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

ఈ వివాదానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని మధ్యప్రదేశ్ పోలీసులు మోనాలిసాకు నోటీసులు జారీ చేశారు. అయితే నివేదికల ప్రకారం, తన భార్య ప్రస్తుతం గర్భవతి అని, ఆమె ఆరోగ్యం సరిగా లేని కారణంగా సుదూర ప్రయాణాలు చేయడం కష్టమని ఫర్మాన్ ఖాన్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. గర్భధారణ కారణంగా ఆమె విచారణకు హాజరు కాలేదని, ఆమెకు విశ్రాంతి అవసరమని ఫర్మాన్ చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి మోనాలిసా పెళ్లి సమయంలో ఆమె వయస్సుపై పెద్ద ఎత్తున గొడవ జరిగింది. కేరళ పోలీసులు ఆమెకు 18 ఏళ్లు నిండాయని ధృవీకరించినప్పటికీ, జాతీయ ఎస్టీ కమిషన్ విచారణలో ఆమె మైనర్ అని తేలడం.. ఫర్మాన్‌పై పోక్సో (POCSO) కేసు నమోదు కావడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం హైకోర్టు జోక్యంతో ఈ జంటకు అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది.

Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..

కేవలం ఫోటోలతో ప్రపంచాన్ని ఆకర్షించిన మోనాలిసా జీవితం, ఇప్పుడు చట్టపరమైన చిక్కులు, వ్యక్తిగత మలుపుల మధ్య నలుగుతోంది. తాజా ప్రెగ్నెన్సీ వార్త ఈ కేసును ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాలి. అయితే ఈ ప్రచారం కేవలం సోషల్ మీడియా, భర్త చేసిన ప్రకటనల ఆధారంగా మాత్రమే వినిపిస్తుంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..

Follow Us